అమరావతి : ఇందుకేనా అమరావతిపై వ్యతిరేకత పెరిగిపోతోంది ?

Vijaya






రాజధాని అమరావతి పై మిగిలిన ప్రాంతాల్లోని జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. దీనికి కారణం అమరావతి ప్రాంతం అంటే మిగిలిన జనాల్లో ఈర్ష్యకాదు. అమరావతి పేరుచెప్పుకుని కొందరు ప్రత్యేకంగా కమ్మోరు చేస్తున్న ఓవర్ యాక్షన్ వల్లే  మిగిలిన జనాల్లో మంటపెరిగిపోతోంది. తాజాగా అమరావతిలో మొదలైన పాదయాత్ర సందర్భంగా రేణుకాచౌదరి చేసిన ఓవర్ యాక్షన్ ఇలాంటిదే. అమరావతి పాదయాత్రతో రేణుకకు ఎలాంటి సంబంధంలేదు.




ఎందుకంటే ఈమెది హైదరాబాద్. ఖమ్మం నుండి రెండుసార్లు లోక్ సభకు పోటీచేసి గెలిచారు. అంటే ఈమె రాజకీయజీవితమంతా హైదరాబాద్, తెలంగాణా మాత్రమే. మరి ఈమెకు ఏపీ రాజకీయాలతో ఏమిపని ?  అమరావతి విషయంలో ఎందుకని రెగ్యులర్ గా వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ? ఎందుకంటే ఈమె కూడా కమ్మోరు కాబట్టే అనే ఆరోపణలున్నాయి. పైగా ఈమే చెప్పారు కమ్మోరు ఎక్కడున్నా అంతా ఏకమవ్వాలని. విచిత్రం ఏమిటంటే ఈమె రెగ్యులర్ గా అమరావతి ప్రాంతంలో తిరిగి జగన్ను  నోటికొచ్చినట్లు తిట్టేసి వెళిపోతుంటారు.



తెలంగాణాలో ఇంకా చాలామంది కమ్మోరున్నా వాళ్ళెవరు ఈమెలాగ అమరావతికి వచ్చి జగన్ను తిట్టి స్ధానికులను రెచ్చగొట్టి  ఓవర్ యాక్షన్ చేయటంలేదు. రేణుక లాంటి వాళ్ళ వల్లే అమరావతి అంటే మిగిలిన ప్రాంతాల్లోని జనాలకు మంట పెరిగిపోతోంది. ఓవర్ యాక్షన్ చేయటం ఎందుకు ? మిగిలిన జనాల్లో లేని వ్యతిరేకతను సృష్టించుకోవటం ఎందుకు ?



ఇపుడు రైతుల ముసుగులో రియాల్టర్లు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల మద్దతుదారులు మొదలుపెట్టిన పాదయాత్ర వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీలేదు. ఇదే సమయంలో జగన్ కూడా తానుఅనుకుంటున్నట్లు స్వేచ్చగా మూడు రాజధానుల ఏర్పాటు చేయలేకపోతున్నారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందా ? లేకపోతే మూడు రాజధానులు ఉంటాయా అన్నది తేలాలంటే 2024 ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగనే సీఎం అయితే వ్యతిరేకులకు  చేయటానికి ఏమీ ఉండదు. పోనీ చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ నోరెత్తేందుకు ఏమీ మిగలదంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: