అమరావతి : ఎల్లోమీడియానే పరువు తీసేసిందా ?

Vijaya





తానెంతో నమ్ముకున్న ఎల్లోమీడియానే తన పరువు తీసేస్తుందని చంద్రబాబునాయుడు బహుశా ఎప్పుడూ ఊహించుండరు. ఊహించకపోయినా చివరకు జరిగింది మాత్రం ఇదే. తాజాగా ఎన్డీయేలో చేరికపై మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిస్తు రాసిన వాళ్ళనే అడగండి అని చాలా విసురుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు సమాధానమిచ్చిన విధానంలోనే తానెంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అందరికీ అర్ధమైపోయింది.



ఎన్డీయేలో చేరాలని చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి దూరమై తప్పుచేశానని వైజాగ్ పర్యటనలో చంద్రబాబు బహిరంగంగా అంగీకరించారు. తర్వాత నుండి బీజేపీ అడగకపోయినా ఎన్డీయేకి మద్దతిస్తునే ఉన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలోనే కాకుండా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిబిల్లుకు టీడీపీ మద్దతిస్తునే ఉన్నది. ఎప్పుడైనా నరేంద్రమోడీ మనసు మారకపోతుందా, తనను ఎన్డీయేలో చేర్చుకోకపోతారా అని చంద్రబాబు ఎదురుచూస్తున్నారు.



అయితే చంద్రబాబు నిరీక్షణకు ఫలితం రాకపోగా అమిత్ షా-జూనియర్ ఎన్టీయార్ భేటీ జరిగింది. ఇది పుండుమీద కారం రాసినట్లయ్యింది చంద్రబాబుకు. అందుకనే వెంటనే టీడీపీ ఎన్డీయేలో చేరబోతోందంటు ఢిల్లీ నుండి కథనం వచ్చింది. వెంటనే రిపబ్లిక్ టీవీలో కూడా ఇలాంటి కథనమే వచ్చింది. ఈ రెండింటినీ చంద్రబాబే మ్యానేజ్ చేసుకున్నారని బీజేపీ అనుమానిస్తోంది.  చంద్రబాబు ఊహించనిరీతిలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతు ఎన్టీయేలో టీడీపీని చేర్చుకునేది లేదని తేల్చిచెప్పేశారు.  లక్ష్మణ్ ప్రకటన చంద్రబాబుకు పెద్ద అవమానమనే చెప్పాలి.



ఎందుకంటే టీడీపీలో ఎన్డీయేలో చేరిపోతోందని ఎల్లోమీడియా ఒకటే ఊదరగొట్టేసి ముహూర్తం కూడా నిర్ణయించేసింది. ఎల్లోమీడియా చేసిన అతివల్లే బీజేపీ నేతలకు బాగా మండినట్లు సమాచారం. తమను మీడియా ద్వారా ఒత్తిడికి గురిచేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కమలనాదులు ఫీలయ్యారు. అందుకనే లక్ష్మణ్ తో టీడీపీ చేరికపై స్పష్టంగా ప్రకటన చేయించారట. అంటే ఎల్లోమీడియా ఓవర్ యాక్షన్ వల్ల జాతీయస్ధాయిలో చంద్రబాబు పరువు పోయిందనే చెప్పాలి. తెలంగాణాలో టీడీపీకున్న బలమైన ఓటుబ్యాంకు కోసమే  బీజేపీతో చంద్రబాబుతో పొత్తుకు రెడీ అవుతోందన్నట్లుగా ఎల్లోమీడియా కథనాలు ఇచ్చింది. ఇలాంటి కథనాలే చివరకు చంద్రబాబు పరువు తీసేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: