దేశంలోనే ఖరీదైన రాకి.. ధర ఎంతో తెలిస్తే మాత్రం షాకే?

praveen
రాఖీ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు అక్కా తమ్ముళ్ళ బంధానికి ప్రతీక మైన  పండుగ అన్న విషయం తెలిసిందే. ఇక అన్న చెల్లెలు ఎంత దూరంలో ఉన్న రాఖీ పండుగ వచ్చిందంటే చాలు ఒక చోట చేరిపోతారు. ఇక తప్పనిసరిగా చెల్లి అన్నయ్యకు రాఖీ కడుతూ ఉంటుంది. దేశ విదేశాల్లో ఉన్నా సరే ఇక చెల్లితో రాఖీ కట్టించుకోవడానికి అన్నయ్య ఎప్పుడూ వస్తూనే ఉంటాడు అని చెప్పాలి. చెల్లెలికి అన్న రక్ష గా ఉండాలి అనే ఒక అర్థంతో రక్షాబంధన్ నిర్వహించుకుంటూ ఉంటారూ మ్ అయితే మరికొన్ని రోజుల్లో రక్షాబంధన్ పండగ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ పండుగను క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు అందరూ కూడా సిద్ధమైపోయారు.

 ఈ క్రమంలోనే సరికొత్త రాఖీలను తయారు చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.. ఇక ప్రస్తుతం దుకాణాలలో ఎక్కడ చూసినా రాఖీలు దర్శనమిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే గుజరాత్లోని సూరత్ చెందిన ఒక దుకాణంలో ప్రత్యేకమైన రాఖీ లు తయారు చేయడం గమనార్హం. ఇక ఈ దుకాణంలో దారపు రాఖీలు మొదలుకొని బంగారం వెండి ప్లాటినం వజ్రాలు పొదిగిన రాఖీలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ రాఖీల అందాన్ని చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. అంతేకాదండోయ్ దేశంలోనే అత్యంత ఖరీదైన రాఖీ కూడా ఇక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి.

 సూరత్ లోని ఒక జ్యువలరీ షోరూమ్ లో బంగారం వెండి ప్లాటినం వివిధ రకాల రాఖీలను తయారు చేశారు. అయితే ఈ షో రూమ్ లో 400 నుంచి 5 లక్షల వరకు రాఖీలను సిద్ధం  చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ జ్యువెలరీ షాపు యజమాని మాట్లాడుతూ మేము తయారుచేసిన రాఖీలను రక్షాబంధన్ తర్వాత కూడా ఆభరణాలు గా ధరించవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సాధారణంగా రక్షాబంధన్ పండుగ అంటే అక్కా చెల్లెలు  తమ సోదరులకు పట్టు దారంతో మాత్రమే రాఖీ కట్టేవారు. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆచారం ఉంది.  కానీ పట్టణ ప్రాంతాలలో మాత్రం మారుతున్న కాలం ప్రకారం రాఖీల రూపురేఖలు కూడా మారిపోతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: