వాహనదారులకు గుడ్ న్యూస్..!!

Satvika
పెట్రోలు, డీజిల్ ధరలలో రోజు రోజుకు మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే..నిన్న ఉన్న ధరలు నేడు వుండవు అన్న సంగతి తెలిసిందే..ఈరోజు ఏపీ, తెలంగాణాలో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది.ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు.

తెలంగాణాలో ఇంధన ధరలు..
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ పై 18 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.39 కాగా, 16 పైసలు పెరగడంతో డీజిల్‌ లీటర్ ధర రూ.97.56 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే కరీంనగర్‌లో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. 45 పైసలు తగ్గడంతో కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.39 కాగా, డీజిల్ ధర రూ.97.56 అయింది.నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 65 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.15 కాగా, 61 పైసలు తగ్గడంతో డీజిల్‌ లీటర్ ధర రూ.99.20 అయింది. మహబూబ్ నగర్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.44, 80 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ రూ.98.55 అయింది. నల్గొండ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.48 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.63 అయింది.
ఇక ఏపీలో ఇంధన ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు స్వల్పంగా మారాయి. పెట్రోల్‌ లీటర్ ధర రూ.112.16 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.99.81 అయింది.విశాఖపట్నంలో ఇంధన ధరలు పెరిగాయి. విశాఖలో 34 పైసలు తగ్గడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.74 అయింది. 30 పైసలు తగ్గడంతో డీజిల్‌ లీటర్ ధర రూ.98.51 అయింది.చిత్తూరులో పెట్రోల్ లీటర్ రూ.112.66 కాగా, డీజిల్‌ ధర ఏకంగా సెంచరీ కొట్టింది. చిత్తూరులో డీజిల్ పై ఒక రూపాయి పెరగడంతో లీటర్ ధర రూ.100.30 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో 20 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.112.70 కాగా, డీజిల్ ధర రూ. 99.46 అయింది. నెల్లూరులో పెట్రోల్ ధర రూ.112.24 కు చేరింది. 61 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.99.91 అయింది..కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.9.5 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది..మొత్తానికి ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ధరలు నమోదు అయ్యాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: