జనసేన లోకి హైపర్ ఆది... ఎమ్మెల్యే గా పోటీ ?

VAMSI
ఈటీవీ లో వారానికి రెండు రోజులు ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎందరో చిన్న చిన్న కళాకారులు వచ్చి స్టేజ్ పై తమదైన స్కిట్ లతో ఎందరినో ఆకట్టుకుని స్టార్ కమెడియన్ లుగా మారిపోయారు. అలాంటి కమెడియన్ లలో ఒకరు హైపర్ ఆది. ఇతని పంచ్ లకు సెపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు అంటే నమ్మగలరా ? ఇతని స్కిట్ లను చూడడానికి ప్రతి గురువారం రాత్రి టీవీలకు అతుక్కుపోతారు. అంతలా తమ స్కిట్ లు వారిపై ప్రభావం చూపిస్తాయి. అలా తనకు వచ్చిన ఫేమ్ తో కొన్ని సినిమాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతని పంచ్ లకు చిరంజీవి మరియు బ్రహ్మానందం లు కూడా ఫ్యాన్ అయిపోయారు.
ఇదిలా ఉంటే... హైపర్ ఆదికి కూడా స్టార్ హీరో మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే వీరాభిమానం. ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ ఏమి చేయమన్నా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేయగలడు. గతంలో కూడా జనసేన తరపున క్యాంపెయిన్ చేశాడు. అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం
హైపర్ ఆది అధికారికంగా జనసేనలో చేరనున్నాడు అని తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ వారంలోనే ఈ వార్త అధికారికంగా వెలువడే అవకాశాలు ఉన్నాయట.
కాగా హైపర్ ఆది ప్రకాశం జిల్లాకు చెందిన వాడు కావడం వలన నెల్లూరు జిల్లా లేదా ప్రకాశం జిల్లా లో ఒక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి సిద్ధం గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ విషయం ఒక గాసిప్ లాగా ఉంది... త్వరలో పార్టీ నుండి కానీ.. హైపర్ ఆది నుండి కానీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: