అమరావతి : చంద్రబాబు ఏడుపుకు అసలు కారణం తెలుసా ?

Vijaya

అధికార వైసీపీ రెండురోజుల ప్లీనరీ విజయవంతం అయ్యిందనటానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఏడుపే సాక్ష్యం. నగిరి రోడ్డుషోలో మాట్లాడుతు శాశ్వత అధ్యక్షుడిగా నియమించే విషయంలో నానా రచ్చ చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగ జరుగుతుందా ? మొదట్లో చెల్లిని ఇపుడు తల్లిని తరిమేశాడంటు చంద్రబాబు భోరుభోరున ఏడుస్తున్నారు. ఏ పార్టీలో కూడా అధ్యక్షుడిని ఎన్నిక ద్వారా తప్ప శాశ్వత అద్యక్షుడిగా నియమించుకోవటం లేదని ఒకటే గోల చేస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి శాశ్వత అధ్యక్షుడా లేకపోతే ప్లీనరీలో ఎన్నిక నిర్వహించి అధ్యక్షుడవుతారా అన్నది వైసీపీ-జగన్ కు సంబంధించిన అంతర్గత వ్యవహారం. ఆ మాటకొస్తే అసలు చంద్రబాబు టీడీపీకి అధ్యక్షుడు ఎలాగయ్యారు ? వ్యవస్ధాపక అద్యక్షుడు ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కునే కదా అయ్యింది. చంద్రబాబు లాగ జగన్ ఎవరో పెట్టిన పార్టీని లాక్కుని అధ్యక్షుడిగా ప్రకటించుకోలేదే. పార్టీని పెట్టి నానా అవస్తలుపడి, కేసులు, జైలు జీవితాన్ని గడిపి, పాదయాత్రచేసి రెక్కల కష్టంమీదే పార్టీని అధికారంలోకి తెచ్చాడు.మరలాంటి పార్టీకి జగన్ శాశ్వత అధ్యక్షుడైతే చంద్రబాబుకు వచ్చిన బాధేమిటి ? ఇక విజయమ్మ విషయానికి వస్తే తెలంగాణాలో పార్టీపెట్టిన తన కూతురు షర్మిల కష్టంలో తోడుండాలన్న ఉద్దేశ్యంతోనే ఏపీలో పార్టీ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. ఇందులో తల్లితో జగన్ బలవంతంగా రాజీనామా చేయించారని చంద్రబాబు, ఎల్లోమీడియా గోలచేయటంలో అర్ధమేంటి ?
విజయమ్మ చెప్పిన కారణంలో లాజిక్కున్నది. ఆ లాజిక్కు నచ్చకపోతే అది చంద్రబాబు, ఎల్లోమీడియా సమస్య. అయినా వైసీపీకి జనాలు అఖండ విజయాన్ని అందించింది జగన్ను చూసేకానీ విజయమ్మను చూసికాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపధ్యంలోనే చంద్రబాబు, ఎల్లోమీడియా ఒకటే ఏడుస్తున్నారంటే రెండురోజుల ప్లీనరీ బ్రహ్మాండంగా విజయవంతమైందనే అనుకోవాలి. ప్లీనరీ విజయవంతం కాకపోతే ఎల్లోమీడియా, చంద్రబాబు ఇంతలా ఏడ్చేవాళ్ళే కాదన్నది నూరుశాతం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: