వైఎస్ అభిమానుల ఉత్కంఠకు తెరపడుతుందా ?

VAMSI
మరో రెండు రోజుల్లో మాజీ ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు రానుంది. దీని కోసం కొద్ది రోజుల నుండి కడప జిల్లాలోని తన సమాధి ఇడుపుల పాయ వద్ద ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం 8 వ తేదీ ఉదయం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయకు వస్తున్నారు. ఇక వైఎస్ కూతురు షర్మిల మరియు భార్య విజయమ్మ సైతం ఇక్కడకు వచ్చి ఆయనను స్మరించుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం అందరినీ ఎంతో ఉత్కంఠకు గురి చేస్తోంది. ఏపీలో వైసీపీ కి గౌరవ అధ్యక్షురాలు అయిన విజయమ్మ మరియు జగన్ చెల్లెలు షర్మిల లు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ టీపీ ను స్థాపించి అక్కడ పాదయాత్రలో ఉన్నారు.
తల్లి విజయమ్మ ఈ పార్టీకి కూడా గౌరవ అధ్యక్షురాలిగా ఉండడం గమనార్హం. కానీ ఆనాడు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగానే చెప్పడం జరిగింది. అప్పటి నుండి జగన్ కు షర్మిలకు గ్యాప్ వచ్చింది. దీనితో రాఖీ రోజు కూడా ఇద్దరూ కలవకపోవడం ఎన్నో విమర్శలకు తావిచ్చింది. అయితే దీనికి అంతటికీ కారణం ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం అయిన షర్మిలను రాజకీయంగా ఎదగనివ్వకపోవడం అని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే... 8 వ తేదీ ఇడుపులపాయకు రానుండగా ముగ్గురు కలిసి తండ్రి పుట్టినరోజు కోసం ప్రార్దనలు చేస్తారా లేదా ఎవరి పాటికి వారు తమ కార్యక్రమాలు చూసుకుంటారు అన్న విషయంపై వైఎస్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే జగన్ అభిమానులు మాత్రం మళ్లీ షర్మిల జగన్ కలవాలని ఆశ పడుతున్నారు. మరి అభిమానుల కల నెరవేరుతుందా లేదా అన్నది తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: