'ఆత్మకూరు ఉప ఎన్నిక' విజయమే గౌతమ్ రెడ్డికి సరైన నివాళి !

VAMSI
ఆత్మకూరు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే నామినేషన్ కు సంబంధించిన ప్రక్రియ పూర్తి అయింది. మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఆత్మకూరు అసీంబ్లీ స్థానానికి వైసీపీ నుండి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తుండడం తెలిసిందే. ఇక ఈ ఎన్నిక నుండి ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ దూరంగా ఉంటోంది. అయితే జాతీయ పార్టీ బీజేపీ మాత్రం వైసీపీపై పోటీకి సిద్ధమైంది. ఈ పార్టీ నుండి భరత్ కుమార్ రెడ్డి సవాలు విసురుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీనే అంటూ ఇప్పటికే వైసీపీ ధీమాతో ఉంది. ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ బలంగానే ఉంది. కానీ గడిచిన ఈ మూడు సంవత్సరాల జగన్ పాలనను బట్టి ప్రజలు తమ ఓటును వేయనున్నారు.
ఒకవేళ టీడీపీ పోటీలో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆశ్చర్యకరంగా టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీకి విజయం తధ్యమేనన్న మాటే వినిపిస్తోంది. కానీ ప్రజలు ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారు అన్నది ఎవరూ ఊహించలేము. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆత్మకూరు ఎన్నికలో గెలవడానికి వైసీపీ అధిష్టానం మంత్రులను అక్కడే మోహరించింది. అయితే వీరు ప్రచారానికి వెళుతున్నా ప్రజల నుండి అంతగా స్పందన రావడం లేదన్నది పబ్లిక్ టాక్. మరి ఇక్కడి ప్రజలు వైసీపీకి బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారా ? అన్నది ఒక ప్రశ్న. ఈ ఎన్నిక కోసం మొత్తం స్వతంత్ర్య అభ్యర్థులను కలుపుకుని 14 మంది పోటీలు ఉన్నారు .
ఈ ఎన్నికను చనిపోయిన గౌతమ్ రెడ్డికి ఒక నివాళిగా ఇవ్వాలని పార్టీ కష్టపడుతోంది. మరి ఈ నియోజకవర్గ ప్రజలు గౌతమ్ రెడ్డి ఆత్మకు అఖండ మెజారిటీతో గెలిపించి తన ఆత్మకు శాంతి చేకూరుస్తారా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: