మహిళలకు జగన్ సర్కార్ చిరు కానుక..రూ.2 లక్షల రుణాలు..

Satvika
ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తుంది.. కొన్ని పథకాలు ప్రజలకు లాభాన్ని చేకూరిస్తే మరి కొన్ని పథకాలు మాత్రం జనాలకు విసుకు తెప్పిస్తున్నాయి. అయిన కూడా సర్కారు చేయాలనుకుంది చేస్తూనే ఉంటారు.. అమ్మవడి పేరుతో విద్యార్థులకు ప్రతి ఏటా నగదును అందజేసిన ప్రభుత్వం ఈ ఏడాది కొత్త పద్దతులను అమల్లో కి తీసుకు వచ్చింది. ఇప్పుడు మహిళల కోసం మరో తీపి కబురును అందిస్తుంది.. పించన్ పరంగా కానీ, రైతులకు గుడ్ న్యూస్ లను చెబుతోంది.. ఇటీవల రైతులకు రైతు భరోసా నగదును అందించింది.


మహిళలు అన్ని రంగాల్లో రాణించడమే కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశం తో ప్రభుత్వం వడ్డీ లేని రుణాల ను మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. వడ్డీ లేని రుణంతో మహిళలు ఆర్థికం గా అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యం తో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయాలని రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే అధికంగా రుణాలు ఇచ్చే అవకాశం ఉందని ఎన్నో సార్లు అధికారులు చెప్పారు. అందుకోసం ఎన్నో విధాలు గా ప్రభుత్వం మహిళల కు సహకారాన్ని అందిస్తుంది.. అందులో బాగాంగ డ్వాక్రా ను అమలులో కి తీసుకొచ్చారు..


ఈ మేరకు డ్వాక్రా లో ఉన్న మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. డ్వాక్రా లో చిరు వ్యాపారాలు చేస్తున్న మహిళలను గుర్తించి వారి అభివృద్ధికి మరింత బాసటగా నిలవాలని సర్కారు భావిస్తుంది.. ఏపీ రాష్ట్రం లోని ప్రతి గ్రూప్ నుంచి ఇద్దరు మహిళా వ్యాపారులను గుర్థిస్తారు.. వారి అభివృద్ధికి అవసరమైన వనరుల గురించి తెలుసుకుంటారు. ఇందుకు గాను వారికి రూ.75 వేల నుంచి రూ.2 లక్షల రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ రుణం వల్ల ఆర్ధికంగా ఎదుగుతారని భావిస్తున్నారు. సర్కారు నిర్ణయం పై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: