ఇదెక్కడి విచిత్రం సామీ.. ఏడాది ఆలస్యంగా వచ్చిన రైలు?

praveen
ఇటీవల కాలంలో ఎక్కువమంది దూర ప్రయాణాలకు రైలు ప్రయాణాల  పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. రైలు ద్వారా ప్రయాణించటం ద్వారా సేఫ్టీ తో పాటు అతి తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేసే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా తమ ప్రయాణాలను కోసం రైలుని మొదటి ఆప్షన్ ను ఎంచుకుంటున్నారు. అయితే మన దేశంలో రైల్వేశాఖపై ఎన్నో రోజుల నుంచి ఒక అపవాదు కొనసాగుతూ వస్తోంది. ఎప్పుడు రైలు టైం రాదని.. ఇక అటు ప్రయాణికులు అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయని అంటూ ఉంటారు ఎంతో మంది ప్రయాణికులు. ఇక నిజంగానే ఇలాంటి అనుభవాలు ఎంతోమంది రైల్వే ప్రయాణికులకు ఎదురయ్యాయని చెప్పాలి.

 ఇక ఒకవేళ రైలు సరైన సమయానికి వచ్చింది అంటే ప్రయాణికుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇటీవలి కాలంలో అటు రైల్వే శాఖ ఇదే విషయంపై దృష్టి పెట్టింది. రైళ్లలో ప్రయాణికులకు అందరికీ సరైన సదుపాయాలు కల్పించడమే కాదు ఇక ఖచ్చితమైన సమయానికి రైళ్లు గమ్యస్థానం చేరుకునే విధంగా ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక రైల్వే స్టేషన్ లో రైలు సరైన సమయానికి చేరుకోవడంతో అక్కడ ప్రయాణికులు ఆనందం లో డాన్స్ చేసిన వీడియోలు కూడా వైరల్ గా మారిపోయాయ్. అది సరే గానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా.

 సాధారణంగా మన దేశంలో రైళ్లు ఆలస్యంగా వస్తాయి అన్నది అందరికీ తెలిసిన నిజం. అయితే ఒక గంట లేదా రెండు గంటలు ఆలస్యంగా రావడం ఇప్పటి వరకు చూశామూ. కానీ ఇక్కడ గూడ్స్ రైలు మాత్రం ఏకంగా ఒక ఏడాది ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. 2021 మేలో ఛత్తీస్గఢ్లోని ఓ స్టేషన్ నుంచి 1000 బియ్యం బస్తాలతో బయలుదేరింది రైలు. ఈ క్రమంలోనే 762 కిలోమీటర్ల దూరంలోనీ ఝార్ఖండ్ గిరిడ్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంది. రైలును ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈనెల 17వ తేదీన గమ్యస్థానానికి తీసుకువచ్చారు. దీంతో ఇక ఈ రైల్ లో ఉన్న బియ్యం బస్తాలు మొత్తం పాడైపోయాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారి స్పందిస్తూ సమగ్ర విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: