ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే?

VAMSI
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ రంగం ఫుల్ కాకమీద ఉంది. ఏ నాయకుడిని టచ్ చేసినా షాక్ కొట్టేలానే కనిపిస్తోంది. తాజాగా మరో రాజకీయ వివాదం రాజుకుంది. తన ఘాటైన కౌంటర్ ఎటాక్ తో అటు టిడిపి ఇటు జనసేన రెండు పార్టీలను టార్గెట్ చేశారు మంత్రి జోగి రమేష్‌. తాజాగా పొత్తులపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు కురిపించిన టీడీపీ లీడర్ చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయి అన్నది తెలిసిందే. కాగా ఇపుడు వాటికి రీ కౌంటర్ ఇచ్చే పనిలో పని అన్నట్లుగా జనసేనకి కూడా వడ్డించేసారు ఈ అధికారపార్టీ నాయకుడు. జోగి రమేష్ నిన్న ఇరు పార్టీలను ఉద్దేశించి పొత్తుల కోసం చంద్రన్న పాకులాడుతుంటే , ప్యాకేజీల కోసం పవన్ అన్న పరుగులు తీస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్.
అధికార పార్టీని ఎవరూ టచ్ చేయలేరని నిజానికి ఆంధ్రా ప్రజలు కనీసం టచ్ చేసే అవకాశం కూడా ఇవ్వరని రానున్న 2024 ఎన్నికల్లోనే కాదు ఆపై వరుస ఎలక్షన్స్ లోనూ రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డ వై ఎస్ జగనే ఏపి సిఎం అవుతారని, జనం దగ్గరుండి గెలిపిస్తారని అన్నారు. సింహం ఎపుడు కూడా సింగిల్ గానే వస్తుంది తప్ప ఎవరి పొత్తు కోరదని సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతేనని అన్నారు. అయితే ఇలా ఒకరి మీద ఒకరు కామెంట్ లు చేసుకుంటే గెలుపు రాదని, ప్రజలకు నచ్చే పనులు ప్రజల కోసం చేస్తే ఓట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే రాబోయే ఎన్నికలలో గెలవాలి అనుకున్న పార్టీలు ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల ముందుకు వెళ్ళాలి. వారికీ అవసరం అనిపించినా పనులను చేస్తామని హామీ ఇచ్చి దానిని నిలబెట్టుకునే దిశగా అడుగులు వెయ్యాలి. అప్పుడే ప్రజలు ఏ పార్టీని అయినా సరే నమ్మి ఓటేస్తారు. మరి అటువంటి మార్పు రాజకీయ పార్టీలలో వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: