సీఎం పరిహారంపై ప్రశ్నించిన జనసేనాని!

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పరిహారంపై జనసేనాని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రమాదాన్ని బట్టి పరిహారమా? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు.ఇక ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన చాలా బాధాకరమని జనసేన అధ్యక్షుడు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.ఇక ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విషాదం నింపిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా  కూడా బాగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్ట పరిహారం అనేది అందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇంకా తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు అలాగే గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించి నిలదీశారు.


ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఇవ్వడమేంటని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అనేది అందించి న్యాయబద్దంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. ఈ రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు అనేవి చోటుచేసుకుంటున్నాయని.. అధికార యంత్రాంగం భద్రతా ప్రమాణాలపై ఎప్పుడూ కూడా తనిఖీలు అనేవి చేసి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోరారు.ఇక అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఖచ్చితంగా పటిష్ట చర్యలు అనేవి తీసుకోవాలన్నారు.ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ప్రమాద బాధితులను సోము వీర్రాజు పరామర్శించడం జరిగింది. బాధితులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: