హైకోర్టుకు సీఎం జగన్ కొత్త వినతి!

Purushottham Vinay
హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరు మాసాల్లో అమరావతి ప్రాంత నగరం అభివృద్ధి సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. హైకోర్టులో ఈ మేరకు 190 పేజీల అఫిడవిట్ ని దాఖలు చేసింది.ఇక ఈ తీర్పులో నిర్దేశించిన అన్నీ గడువులను తొలగించాలని కోరింది. నెలరోజుల్లో మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలని మూడు నెలల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అందించాలని కూడా చెప్పింది. అలాగే ఆరు మాసాల్లో అమరావతి నగరాన్ని కూడా నిర్మించాలని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే.ఈ విషయంపైనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ తన అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు చెప్పినట్లు చేయటం అసలు సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. ప్లాట్ల అభివృద్ధి గడువును కూడా ఐదేళ్ళకు పెంచాలని కోరింది. ఇదే సమయంలో తిరిగిచ్చే ప్లాట్ల అభివృద్ధిని మాత్రమే టేకప్ చేసేందుకు అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేసింది. నిధుల లభ్యత ప్రాధాన్యతలను హైకోర్టు పరిశీలించాలని హైకోర్టుకు ప్రభుత్వం గుర్తుచేయడం జరిగింది.ఇక నిర్ణీత గడువులోగా అభివృద్ధి చేయటం సాధ్యం కాదని చెప్పేసింది. ఆచరణ సాధ్యం కాని పరిస్ధితులను వివరించేందుకు తాజా అఫిడవిట్ దాఖలు చేసినట్లు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తన అఫిడవిట్లో తెలిపారు.

ఇక రోడ్ల నిర్మాణానికి 16 మాసాలు నీటి సరఫరా డ్రైనేజి విద్యుత్ సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 36 నెలల టైం పడుతుందని ప్రభుత్వం చెప్పింది. మొదటి దశలో రాజధాని అభివృద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రు. 1.09 లక్షల కోట్లు అవసరమవుతుందని కూడా గుర్తుచేసింది.మొత్తానికి ఇక తీర్పు వచ్చిన ఇన్ని రోజులకు ప్రభుత్వం తన మనసులోని మాటను అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు వివరించడం జరిగింది. ఇక్కడ చెప్పిన రు. 1.09 లక్షల కోట్లు అవసరమన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేసిన అంచనాయే. దాన్నే యధాతధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపింది.కేంద్ర ప్రభుత్వం ఎలాగూ ఈ మొత్తం ఇవ్వదు.ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అందుకే ఏ రూపంలో చూసినా  కాని హైకోర్టు తీర్పు ఆచరణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: