నేను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నంత వరకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనలేదు..!

Veldandi Saikiran
సీఎస్ సమీర్ శర్మను కలిసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  నాపై జరుగుతున్న విచారణ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరాను...  నా సస్పెన్షన్ విషయం కోర్టు వద్ద పెండింగులో ఉందన్నారు  ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. గత నాలుగు రోజులుగా నా వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు... నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేయడానికి ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరానని అన్నారు  ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. నన్ను సస్పెండ్ చేసిన నాటి నుంచి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.. ఇది ఎంత వరకు సమంజసం... ఆరు పేజీల అబద్దాలను సీపీఆర్వో పూడి శ్రీహరి మీడియాకు రిలీజ్ చేశారన్నారు  ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. ఆరు పేజీల్లోని అంశాలు నాపై దాఖలు చేసిన ఛార్జ్ మెమోలో లేవు... రూ. 25 కోట్లు కుంభకోణం జరిగిందని బయట ప్రచారం చేశారు కానీ.. ఛార్జ్ షీట్లో ఎందుకు లేదు..? అన్నారు  ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. నాపై వేసిన మూడు అభియోగాల్లో అవినీతికి సంబంధించిన అంశమే లేదు... ఏకంగా దేశద్రోహినన్నారన్నారు  ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. 

ప్రాణాలను అడ్డం పెట్టి విధి నిర్వహిస్తే.. నాది దేశద్రోహమా..?ఈ విధంగా అబద్దాలను ప్రచారం చేసి.. నన్ను.. నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. పెగాసెస్ విషయంలో ప్రస్తుతం నాపై చేస్తోన్న ఆరోపణల్లోనూ ఎలాంటి వాస్తవం ఉండదని చెప్పారు  ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.
ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని.. ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ప్రచారం చేస్తారా..? జీవితాంతం దుష్టుల నుంచి ప్రజలను రక్షిస్తే.. ఇప్పుడు నాకే రక్షణ లేకుండా పోయింది. ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది.. కానీ ఉద్యోగం చేసే వారికీ కొన్ని రూల్స్ ఉంటాయన్నారు  ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. ప్రభుత్వాన్ని నేను విమర్శించకూడదు... నేను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు.. ప్రైవేట్ వ్యక్తులు చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి నేను మాట్లాడుతున్నానన్నారు  ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. నేనేం నాగాలాండ్ నుంచి రాలేదు..పంజాబ్ నుంచి రాలేదు.. ఏపీ మట్టిలో పుట్టాను.తప్పు చేయాలంటే భయపడే వ్యక్తిని నేను.ఇలా జరుగుతుందని తెలిస్తే సివిల్ సర్వీసెసులోకి నేను వచ్చే వాడినా..? మరేవరైనా వస్తారా..? అని చెప్పారు  ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. నేను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నంత వరకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనలేదు.. ఇది ఫైనల్ అన్నారు  ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: