వెస్ట్‌లో మళ్ళీ క్లీన్‌స్వీపేనా?

M N Amaleswara rao
టీడీపీ-జనసేన పార్టీల పొత్తు పొడవనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చలు మొదలయ్యాయి...పొత్తు వల్ల రెండు పార్టీలకు లాభం ఎంత? అలాగే వైసీపీకి నష్టం ఎంత? పొత్తు ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలు ఏవి? ఇలా ఒకటి అనేక రకాలుగా చర్చలు వస్తున్నాయి..ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఉంటే..ఈ పొత్తు ప్రభావం ఏ జిల్లాపై ఎక్కువ ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..ఖచ్చితంగా కొన్ని జిల్లాలపై పొత్తు ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు...ఇక ఎక్కువగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పొత్తు ప్రభావం ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
అందులోనూ పశ్చిమలో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది...ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలు కలిసి పోటీ చేయగా, అప్పుడు  పవన్ కల్యాణ్ పోటీ చేయకుండా, ఆ రెండు పార్టీలకు మద్ధతు ఇచ్చారు...దీంతో పశ్చిమలో క్లీన్ స్వీప్ చేసేశారు..జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉండగా, టీడీపీ 14 సీట్లు గెలుచుకోగా, పొత్తులో భాగంగా బీజేపీ తాడేపల్లిగూడెం సీటులో గెలిచింది. అంటే పశ్చిమలో క్లీన్ స్వీప్ జరిగిపోయింది...వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు.
అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేశారు...అటు టీడీపీ, ఇటు జనసేన సెపరేట్ గా పోటీ చేశాయి...దీంతో పశ్చిమలో భారీ స్థాయిలో ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది..వైసీపీ 13 సీట్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది..అలా 2019 ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది.
మరి ఈ సారి టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది...పొత్తుతో ముందుకొస్తే మరొకసారి వెస్ట్ లో క్లీన్ స్వీప్ జరగడం ఖాయమని విశ్లేషణలు వస్తున్నాయి..15 సీట్లని టీడీపీ-జనసేనలు గెలిచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..అయితే ఎన్నికల నాటికి రెండు పార్టీలు ఇంకా ఎక్కువ కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఒకటి, రెండు సీట్లలో కాస్త ఇబ్బంది అయిన సరే ఎన్నికలనాటికి అంతా సెట్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి వెస్ట్ లో మళ్ళీ క్లీన్ స్వీప్ జరుగుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: