టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుండి గెంటేసిన మార్షల్స్...

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులకు టీడీపీ నాయకులకు ఒక్క క్షణం కూడా పడదని తెలిసిందే. అయితే ఇది మాములుగా డిబేట్ లలో లేదా ఏదైనా మీడియా సమావేశాల్లోనే జరగడం వరకు ఓకే కానీ... ప్రజల క్షేమం మరియు అభివృద్ధి కోసం చట్టాలను తయారుచేసే పవిత్రమయిన అసెంబ్లీలోనూ ఒకరిపై ఒకరు విచక్షణ కోల్పోయి కామెంట్లు చేసుకోవడం ఈ దేశం హర్షించదగిన విషయం అయితే కాదు. అయితే తాజాగా గత వారమే ఏపీ అసెంబ్లీ వేసవి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగా ఈ రోజు జరిగిన సెషన్ లో టీడీపీ కి చెందిన నలుగురు సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం జంగారెడ్డి గూడెం లో జరిగిన నాటుసారా మరణాలు విషయంపై చర్చ జరగాలని టీడీపీ డిమాండ్ చేసిందని, అయితే మేము చర్చకు సిద్ధం... అని అంటునాన వినని టీడీపీ సభ్యులపై బుగ్గన సస్పెండ్ చేయాలని తీర్మానం పెట్టాలని స్పీకర్ ను కోరారట. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ విషయాన్ని స్పీకర్ అంగీకరించి తీర్మానం పెట్టగా అదికాస్తా ఆమోదం పొందడంతో టీడీపీ నుండి అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు వీరాంజనేయులు స్వాములను సస్పెండ్ చేశారు. అయితే ఎందుకు మమ్మల్ని సస్పెండ్ చేశారని వీరు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గొడవ చేయగా, స్పీకర్ తమ్మినేని ఎంతసేపు చెప్పినా వారు వినకపోవడంతో మార్షల్స్ ను పిలిపించి బయటకు పంపినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సమస్య పై ప్రస్తుతం టీడీపీ నాయకులు అసెంబ్లీలో గందరగాయలన్ని సృష్టిస్తున్న తీరు సరిగా లేకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనపై మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు అక్కడకు వెళ్లనున్నారని తెలుస్తోంది. మరి ఈ విషయం ఇంకెంత వివాదంగా మారుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: