శిల్పా ప్రత్యర్థి మారతారా?

M N Amaleswara rao
ఏపీ రాజకీయాల్లో బలంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో శిల్పా చక్రపాణిరెడ్డి కూడా ఒకరని చెప్పొచ్చు..కర్నూలు జిల్లా రాజకీయాల్లో శిల్పా చాలా సీనియర్ నాయకుడు..అనేక ఏళ్లుగా టీడీపీలో పనిచేసిన శిల్పా...ఆ పార్టీలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు..కానీ తర్వాత ఆయన ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీని వదిలేసి...వైసీపీలోకి వచ్చేశారు...ఇక 2019 ఎన్నికల్లో శ్రీశైలం నుంచి పోటీ చేసి..ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై శిల్పా గెలిచారు...ఇక్కడ విచిత్రం ఏంటంటే..2014 ఎన్నికల్లో శిల్పా టీడీపీ నుంచి పోటీ చేయగా, బుడ్డా వైసీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు బుడ్డా గెలిచారు..అలా గెలిచిన తర్వాత బుడ్డా వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చారు.
అటు రివర్స్‌లో శిల్పా టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు..తర్వాత శ్రీశైలంలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు...ఇక 2019 ఎన్నికల్లో బుడ్డాపైనే శిల్పా విజయం సాధించారు...ఈ రెండున్నర ఏళ్ళు ఎమ్మెల్యేగా మంచిగానే పనిచేసుకుంటూ వచ్చారు. ఈ రెండున్నర ఏళ్లలో శిల్పాకు అనుకున్న విధంగా నెగిటివ్ పెరగలేదు...శ్రీశైలం ప్రజలు శిల్పా పట్ల పాజిటివ్‌గానే ఉన్నారు. అయితే ఇలా బలంగా ఉన్న శిల్పాకు చెక్ పెట్టడం బుడ్డా వల్ల అయ్యేలా కనిపించడం లేదు..పైగా అధికారంలో లేకపోవడంతో బుడ్డా పెద్దగా దూకుడుగా పనిచేయడం లేదు...ఏదో మొక్కుబడిగానే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. దీని వల్ల శ్రీశైలంలో టీడీపీ బలపడటం లేదు.
దీంతో బుడ్డాని ఈ సారి పక్కన పెట్టాలనే డిమాండ్ ఎక్కువ వస్తుంది..అసలు గత ఎన్నికల్లోనే బుడ్డా పోటీ చేయనన్నారు...కానీ చంద్రబాబు ఒప్పించి మరీ బుడ్డాని బరిలో దించారు..అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సారి కూడా ఆయన్నే బరిలో దింపితే ప్రయోజనం ఉండదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఈ సారి శిల్పా ప్రత్యర్ధిని మార్చాల్సిందే అంటున్నారు...ఇదే సమయంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిని గాని లేదా బీజేపీలో ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి శ్రీశైలం బరిలో నిలబెడితే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి చంద్రబాబు ...శిల్పా ప్రత్యర్ధిని మారుస్తారో లేదో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: