జగన్‌కు రెడ్ అలెర్ట్: బీటెక్ రవితో కామెడీ కుదరదా?

M N Amaleswara rao
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు పైనే సమయం ఉంది...కానీ ఇప్పటినుంచే చంద్రబాబు...నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు..ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు...తాజాగా కూడా కొన్ని సీట్లని ఫిక్స్ చేశారు..ఈ క్రమంలోనే పులివెందులలో జగన్‌పై పోటీ చేసే ప్రత్యర్ధిని కూడా ఖరారు చేశారు. ఎమ్మెల్సీ బీటెక్ రవిని పులివెందుల టీడీపీ అభ్యర్ధిగా పెట్టారు.
అయితే ఓడిపోయే సీటుకు అప్పుడే అభ్యర్ధిని ఫిక్స్ చేయడం కామెడీగా ఉందని వైసీపీ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి..అసలు పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అని అక్కడ..మరొకరు గెలవడం అసాధ్యమని, అలాంటప్పుడు ఓడిపోయే సీటులో అప్పుడే అభ్యర్ధిని సెట్ చేయడం కాస్త కామెడీగానే ఉందని అంటున్నారు. వాస్తవానికి వైసీపీ చేసే విమర్శలు నిజమే...అసలు పులివెందులలో టీడీపీ గెలవడం అనేది అసాధ్యం. జగన్‌ విజయం ఆపడం ఎవరి వల్ల కాదు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు...కాకపోతే ఇక్కడ మరీ కామెడీ ఏమి లేదని చెప్పొచ్చు.
ఏదో అధికారం బలం, స్థాన బలం ఉందని ప్రత్యర్ధులని తేలికగా తీసుకుంటే చిక్కుల్లో పడక తప్పదని చెప్పొచ్చు. ఎందుకంటే అనవసరంగా టీడీపీ నేత బీటెక్ రవిని కామెడీగా తీసుకుంటే వైసీపీ పరువు పోతుందని చెప్పొచ్చు. పులివెందులలో బీటెక్ రవి గెలవడం జరగని పని...జగన్‌ని ఓడించడం జరగని పని...కానీ ఇక్కడ జగన్ మెజారిటీని తగ్గితే చాలు...అది బీటెక్ రవి సత్తా చాటినట్లే అవుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికల్లో జగన్ దాదాపు 90 వేల భారీ మెజారిటీతో పులివెందులలో గెలిచారు...మరి వచ్చే ఎన్నికల్లో కూడా అదే మెజారిటీతో గెలుస్తారా? అంటే ఏమో చెప్పలేం...గత ఎన్నికలంటే పూర్తిగా జగన్ గాలి ఉంది...టీడీపీపై వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ మెజారిటీ వచ్చింది.
కానీ ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..అటు వైఎస్ వివేకా హత్యకేసు వైసీపీకి మైనస్ అవుతుంది..ఈ పరిణామాల నేపథ్యంలో పులివెందులలో జగన్ మెజారిటీ గాని తగ్గితే కాస్త ఇబ్బంది అని చెప్పొచ్చు...మరి చూడాలి బీటెక్ రవి...జగన్ మెజారిటీ తగ్గిస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: