అందరూ సచివాలయానికి రావాల్సిందే.. ప్రభుత్వం ఆదేశాలు?

praveen
మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ ఎంతలా విలయ తాండవం చేసిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. క్రమ క్రమంగా కేసుల సంఖ్య విపరీతం గా పెరిగి  పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కఠిన ఆంక్షలు అమలు లోకి తీసుకు  వచ్చింది. రాష్ట్రం లో నైట్ కర్ఫ్యూ విధించడమే కాదు అటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది.  ప్రభుత్వం సచివాలయ ఉన్నత అధికారులు అందరూ కూడా ప్రతి రోజూ సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

 అయితే కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినా నేపథ్యంలో ప్రస్తుతం మళ్లీ ఏపీలో సాధారణ పరిస్థితులు వచ్చాయి. అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొన్నటివరకు కరోనా వైరస్ కారణంగా సచివాలయానికి రాని ఉన్నతాధికారులు ఇప్పుడు ప్రతి రోజూ సచివాలయానికి తప్పనిసరిగా రావాలని సూచించింది. కరోనా వైరస్ కేసులు తగ్గిపోయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

 ఇలా ఏపీ సచివాలయం పరిధి లో కరోనా వైరస్ పరిమితులను ఎత్తి వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్య దర్శులు, కార్య దర్శులు అంతా కూడా ఇక నుంచి సచివాలయం నుంచి విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రజలకు ఇంత కాలం జరిగిన అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నాం  అంటూ సిఎస్ చెప్పుకొచ్చారు.. అయితే ఇక సచివాలయాలకు వస్తున్న ఉన్నతాధికారులు బయో మెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా హాజరు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: