దేవినేనికి తమ్ముళ్ళు బ్రేక్ వేశారుగా!

M N Amaleswara rao
ఒకప్పుడు కృష్ణా జిల్లా తెలుగుదేశం అంటే దేవినేని ఉమా పేరు ఎక్కువ వినిపించిన విషయం తెలిసిందే...అసలు జిల్లా రాజకీయాలపై ఈయన పెత్తనం ఎక్కువ ఉండేది..చంద్రబాబు కూడా ఉమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో..జిల్లా టీడీపీలో ఆయన హవా ఎక్కువ ఉండేది..ప్రతి నియోజకవర్గంలోనూ ఉమా జోక్యం చేసుకునేవారు...దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిన విషయం తెలిసిందే...ఈయన పెత్తనం నచ్చక కొందరు నేతలు పార్టీ కూడా వీడారు.
ఈ విధంగా జిల్లాలో ఉమా హవా ఉండేది...కానీ 2019 ఎన్నికల్లో ఉమా ఓడిపోయాక, ఆయనని టీడీపీ నేతలు సైడ్ చేసేశారు..ఉమా పెత్తనం తగ్గించేశారు...అలాగే ఆయన మాట వినే నాయకుడు లేకుండా పోయారు. దీంతో ఉమా కూడా సైలెంట్ అయిపోయారు..కేవలం తన మైలవరం నియోజకవర్గానికే పరిమితమై పనిచేసుకుంటున్నారు. అంతకముందు విజయవాడ నగరం రాజకీయాల్లో ఎక్కువ వేలు పెట్టేవారు...కానీ ఇప్పుడు కేశినేని నాని ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు.

 
ఇలా జిల్లాపై ఉమా పెత్తనం తగ్గింది..కాకపోతే నందిగామలో ఆయన డామినేషన్ కొనసాగుతూనే వచ్చింది..ఎందుకంటే ఇది ఉమా సొంత నియోజకవర్గం..గతంలో ఉమా అన్న రమణ...నందిగామలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రమణ తర్వాత ఉమా 1999, 2004 ఎన్నికల్లో నందిగామ నుంచి గెలిచారు. తర్వాత నందిగామ ఎస్సీ రిజర్వడ్‌గా మారడంతో ఉమా..మైలవరం వచ్చేశారు. ఇక నందిగామలో తంగిరాల సౌమ్య టీడీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు.
అయితే తన ఆధ్వర్యంలోనే నందిగామలో పార్టీ నడిచేలా ఉమా ప్లాన్ చేసుకుని ముందుకెళుతున్నారు....ఇలా నందిగామలో ఉమా పెత్తనం ఉండేది...కానీ ఇటీవల అక్కడ కూడా ఉమా పెత్తనం తగ్గేలా చేసేశారు. నెట్టెం రఘురాం విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు అయ్యాక...నందిగామలో పరిస్తితులు మారాయి. ఏదైనా కార్యక్రమాలు ఉంటే నెట్టెం రఘురాం చూసుకుంటున్నారు. ఉమాని పెద్దగా జోక్యం చేసుకొనివ్వడం లేదు. దీంతో ఉమా సైతం ఈ మధ్య నందిగామ వెళ్ళడం తగ్గించారు. ఇలా కృష్ణాలో తెలుగు తమ్ముళ్ళు...ఉమా పెత్తనానికి బ్రేక్ వేశారు. అందుకే ఉమా ఎక్కువగా మైలవరంకే పరిమితమైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: