మంత్రి సత్యవతి రాథోడ్ కు పితృవియోగం..!

MOHAN BABU
 తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రిగారైన లింగ్యా నాయక్ మరణించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  వారి అభిమానులకు  తీవ్రమైన విషాదం కలిగింది అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా లింగ నాయక్  అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఆయన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పెద్దతండలో ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే మేడారం జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని మంత్రి సత్యవతి రాథోడ్ గత కొద్ది రోజుల నుంచి అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తోంది. ఇంతలో ఆమె తండ్రి గారైన లింగ్యానాయక్ మరణ వార్త రావడం చాలా విషాదకరం.

 లింగ్యా నాయక్ మహబూబాబాద్ జిల్లాలోనే కురవి మండలంలో ఒక మంచి పేరున్న వ్యక్తి. ఎక్కడ ఆపద వచ్చినా నేనున్నానంటూ వచ్చి ఆదుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని చెప్పవచ్చు. అతని మంచితనమే ప్రస్తుతం సత్యవతి రాథోడ్ ను మంత్రి పదవి వరకు తీసుకు వచ్చిందని అనుకోవచ్చు. అంతటి మహనీయుడు మరణించడం అక్కడ జిల్లా వ్యాప్తంగా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి మరణవార్త వినగానే సత్యవతి రాత్రి హుటాహుటిన మేడారం నుంచి తన సొంత వరకు బయలుదేరింది. జాతరకు ముందు రోజూ ఈ విధంగా జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాధపడుతున్నారు. ఏది ఏమైనా ఆమె ఇప్పటికే మేడారంలో అన్ని సకల సౌకర్యాలు కల్పించి పర్యవేక్షించి మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేయడంలో కీలక పాత్ర పోషించింది అని చెప్పవచ్చు. ఆమె పర్యవేక్షణలో గత మేడారం జాతర కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా

 విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఈ ఏడాది కూడా అలా విజయవంతం చేయడం కోసం ఆమె జాతర వద్దే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇంతలో  ఆయన మరణవార్త తెలియగానే మెహబూబా బాదులోని నాయకులు అందరూ సత్యవతి రాథోడ్ సొంతూరికి బయలుదేరుతున్నారు. ఇంతటి మహా జాతర మేడారం సమయంలో ఇలా జరగడం చాలా బాధాకరం. కానీ లింగ్యా నాయక్ గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆయన పలు ఆసుపత్రులు చూపించారు. కానీ నయం కాకపోవడంతో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: