రెడ్లు రెడీ..జగన్‌ చూపు ఎవరి వైపు?

M N Amaleswara rao
వైసీపీలో రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారనే సంగతి తెలిసిందే..దాదాపు 40 మందిపైనే రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు...అంటే 151లో 40 మందిపైనే రెడ్డి ఎమ్మెల్యేలు. ఇలా మెజారిటీ సంఖ్యలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేల్లో...నలుగురికి మాత్రమే క్యాబినెట్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి, చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు...జగన్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
అయితే జగన్ ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేయడానికి చూస్తున్న విషయం తెలిసిందే...త్వరలోనే క్యాబినెట్ విస్తరణ చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారు...మరి అప్పుడు మంత్రి పదవి దక్కించుకోవాలని చాలామంది రెడ్డి ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. మరి ఉన్నవారిలో ఎవరిని క్యాబినెట్‌ నుంచి తొలగించి..ఎవరిని మంత్రివర్గంలో చేర్చుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
గుంటూరులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణరెడ్డి..చిత్తూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, చింతల రామచంద్రారెడ్డి...కర్నూలులో శిల్పా చక్రపాణిరెడ్డి, బాలనాగిరెడ్డి, చెన్నకేశవ రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి..కడపలో శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి..అనంతపురంలో అనంత వెంకట్రామి రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి లాంటి వారు మంత్రి పదవి దక్కుతుందేమో అని చూస్తున్నారు.
కాకపోతే క్యాబినెట్‌లో అన్నీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి...ఎక్కువ మంది రెడ్డి ఎమ్మెల్యేలని క్యాబినెట్‌లో చేర్చుకోవడం కష్టం...అలాగే ఉన్న నలుగురులో ఎవరిని తప్పిస్తారో తెలియదు..ఒకవేళ నలుగురుని తప్పిస్తే కాస్త అవకాశం ఎక్కువ ఉంటుంది..లేదంటే రెడ్డి ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌లో ఛాన్స్ దొరక్కపోవచ్చు. చూడాలి మరి అసలు సీఎం జగన్ మోహన్ రెడ్డి..ఏ రెడ్డి ఎమ్మెల్యేని క్యాబినెట్ లోకి తీసుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: