అస్సాం సీఎంపై క్రిమినల్ కేసులు... కాంగ్రెస్ ధర్నాలు

VAMSI
రాజకీయాల్లో ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతుంటాయి. కొన్ని సార్లు పార్టీల మధ్య చిచ్చుపెట్టే వివాదాలుగా మారుతుంటాయి. అందుకే ఒక రాజకీయ నాయకుడు బహిరంగం మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు మరియు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గందరగోళాన్ని సృష్టిస్తోంది. అసలు విషయం ఏమిటంటే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ రాజకీయాలలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఈ వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు అస్సాం సీఎం పై మండి పడుతున్నారు. ఇదే విషయంపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే ఆ ఫిర్యాదును అంగీకరించి కేసును నమోదు చేసుకున్నారు. ఇదే విధంగా మిగిలిన పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆందోళనలు చేప్పట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈ రోజు ఎస్పీ మరియు కమిషనేర్ ఆఫీసుల ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవడంలేదో సమాధానం చెప్పాలని నిరసనలు చేపట్టారు.
ఈ ధర్నాలో రేవంత్ రెడ్డి మరియు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు అందరూ భాగం కానున్నారు. తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా ఇన్వాల్వ్ అయిందా అన్న విషయంపై కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోంది. నిన్ననే రేవంత్ రెడ్డి కేసీఆర్ మోదీకి కట్టుబడే పనిచేస్తున్నాడని వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అదే నిజమా అని అందరికీ తెలుస్తోంది. మరి ఈ విషయం ఎంత దూరం వెళుతుందో తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: