కొత్త పోలీస్ బాస్ ట్రాక్ రికార్డ్ ఇదే..

RATNA KISHORE
- రాష్ట్ర పోలీస్ బాస్ గా రాజేంద్రనాథ్ రెడ్డి
- 2003-04 లో జిల్లా SP గా పనిచేసిన DGP
ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర DGP గా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ని నియపిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు.సీనియర్ IPS అధికారి అయిన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ DG గా పనిచేస్తున్నారు.ఆయనకు DGP గా పూర్తి బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల పనిచేశారు.విజయవాడ,విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా పనిచేసి అనేక కేసులను పరిష్కరించారు.అలాగే హైదరాబాద్ వెస్ట్ జోన్ IG గా కూడా పనిచేశారు.ఆయన సర్వీస్ లో ఉత్తమ సేవలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ప్రెసిడెంట్ మెడల్ కూడా అందుకున్నారు.
నెల్లూరు జిల్లా sp గా..
నెల్లూరు జిల్లా SP గా 2003-2004 లో పనిచేశారు.ఆ సమయంలో sp గా సమర్థ రీతిలో విధులు నిర్వర్తించారు.అనేక రాబరీ,చోరీ కేసులను పరిష్కరించారు.అలాగే ఆ రోజుల్లో చిన్నపిల్లలు కిడ్నాప్ చేసే ముఠా జిల్లాలో భయబ్రాంతులకు గురిచేసింది.ఈ ముఠా పై ప్రత్యేక దృష్టి పెట్టారు.తనదైన శైలిలో దర్యపు చేసి ముఠా గుట్టు రట్టు చేశారు.అంతేకాకుండా జిల్లాలోని వాసిలి వద్ద
ఆ ముఠాలోని ప్రధాన నిండితుడ్ని ఎన్కౌంటర్ చేసి సంచలనం సృష్టించారు.


పోలీస్ అధికారులు,సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టిసారించి వారి మన్ననలు కూడా పొందారు.2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎంతో సమర్థంగా పనిచేసి పేరు తెచ్చుకుంటారు.ఆ ఎన్నికల అనంతరం రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీపై వెళ్లారు.జిల్లాలో ఆయానకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.ఆయన్ను రాష్ట్ర DGP గా ప్రభుత్వం నియమించడంతో జిల్లాలో ఆయన గురించి తెలిసినవారు.అలాగే ఆయనతో కలిసి పనిచేసిన పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మీ..సునీల్.ఆర్.
సీనియర్ జర్నలిస్ట్,నెల్లూరు.


మరింత సమాచారం తెలుసుకోండి:

dgp

సంబంధిత వార్తలు: