ఆ రెడ్డి తమ్ముళ్ళకు మళ్ళీ కష్టమే?

M N Amaleswara rao
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క రెడ్డి వర్గం నేత కూడా గెలవని విషయం తెలిసిందే..ఒక్కరంటే ఒక్కరూ కూడా టీడీపీలో గెలవలేదు. పోటీ చేసిన ప్రతి రెడ్డి నాయకుడు ఓడిపోయారు. అటు వైసీపీలో మాత్రం రెడ్డి నాయకులు సత్తా చాటారు. ఒకరిద్దరు మినహా పోటీ చేసిన ప్రతి రెడ్డి నాయకుడు విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందా? లేక టీడీపీలో ఉన్న రెడ్డి నాయకులు కూడా ఏమన్నా సత్తా చాటుతారా? అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని చూస్తుంటే కొందరు సత్తా చాటేలా ఉన్నారు...కానీ కొందరు మాత్రం మళ్ళీ గెలవడం కష్టమయ్యేలా ఉంది.
ఎందుకంటే వైసీపీలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు...పైగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో రెడ్డి వర్గం చాలా బలంగా ఉంటుంది...ఈ రెడ్డి వర్గం పూర్తిగా వైసీపీకే సపోర్ట్ చేస్తుంది...అలాంటప్పుడు టీడీపీ తరుపున పోటీ చేసే రెడ్డి నాయకులు చాలా కష్టమైపోతుంది..అలా టీడీపీ తరుపున గెలవడానికి కష్టపడే నేతల్లో సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉంటారని చెప్పొచ్చు. వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్న సోమిరెడ్డి...ఈ సారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు...కానీ సర్వేపల్లి బరిలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు.
అటు కోవూరులో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు...ఇక్కడ టీడీపీ నేత పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బలపడలేదు. అలాగే శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చాలా స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నారు...ఇక్కడ టీడీపీ నేత బుడ్డా రాజశేఖర్ రెడ్డికి మళ్ళీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు...అలాగే పాణ్యంలో టీడీపీ నాయకురాలు గౌరు చరితా రెడ్డి దూకుడుగానే పనిచేస్తున్నారు గాని...అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చెక్ పెట్టే స్థాయికి మాత్రం ఎదగలేదు. వీరే కాదు ఇంకా కొందరు టీడీపీ రెడ్డి నేతలకు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: