ఆ రెడ్లు హ్యాట్రిక్‌కు రెడీ?

M N Amaleswara rao
ఏపీ రాజకీయాల్లో రెడ్డి వర్గం నేతలు బాగా పవర్‌ఫుల్ అనే చెప్పాలి..ఓటింగ్ పరంగా చూసుకుంటే రాష్ట్రంలో రెడ్డి వర్గం ఓట్లు తక్కువే..కానీ వీరు రాజకీయాలని నడిపించడంలో ముందున్నారని చెప్పొచ్చు. దశాబ్దాల కాలం నుంచి వీరు ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు...గతంలో కాంగ్రెస్‌లో, ఇప్పుడు వైసీపీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు...ఇంకా చెప్పాలంటే వైసీపీ ఇంత స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం రెడ్డి వర్గమే.
రాయలసీమ లాంటి ప్రాంతంలో వైసీపీ తిరుగులేని పొజిషన్‌లో ఉండటానికి రెడ్డి వర్గం నేతలే కారణం...అయితే ఇలా వైసీపీకి పెద్ద బలంగా ఉన్న రెడ్డి నేతలు..వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు...రెడ్డి వర్గం నేతలు స్ట్రాంగ్‌గా ఉంటూనే..వైసీపీని స్ట్రాంగ్‌గా ఉంచడానికి చూస్తున్నారు.. అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు సత్తా చాటాలి...గత ఎన్నికల మాదిరిగానే మళ్ళీ గెలవాలి.
మరి గెలిచే సత్తా ఉన్న ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారని చెప్పొచ్చు..ఇక వారిలో కొందరు హ్యాట్రిక్ కొట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. అలా హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్న రెడ్డి ఎమ్మెల్యేల్లో నరసారావుపేట ఎమ్మెల్యే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజంపేటలో మేడా మల్లిఖార్జున్ రెడ్డి, ప్రోద్దటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు ఉన్నారు...ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు సైతం హ్యాట్రిక్‌కు ప్రయత్నిస్తున్నారు..కానీ ఈ ఎమ్మెల్యేలకే మళ్ళీ గెలిచే అవకాశాలు  ఎక్కువ ఉన్నాయి.
అటు మంత్రుల్లో చూస్తే..ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డికి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి..ఆత్మకూరులో టీడీపీ పూర్తిగా వీక్‌గా ఉండటం గౌతమ్‌కు బాగా కలిసొస్తుంది. అలాగే డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మళ్ళీ ఆయన గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకునే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ సారి ఎంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ కొడతారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: