ఫ్యాన్స్ ను విజయ్ ఎందుకిలా చేస్తున్నాడు..?

NAGARJUNA NAKKA
విజయ్‌ పాలిటిక్స్‌లోకి వస్తే ఎంజీఆర్, జయలలితలా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడని అభిమానులు బోల్డన్ని పోస్టులు పెడుతున్నారు. అయితే విజయ్‌ మాత్రం ఇప్పటివరకు పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడలేదు. పైగా తండ్రి చంద్రశేఖర్ స్థాపించిన 'విజయ్ మక్కల్ ఇయక్కం' అనే చారిటీ సంస్థని కూడా మూసేయాలని కోర్టుకి వెళ్లాడు విజయ్. అయితే ఈ హీరో రాజకీయాలకి ఇంత దూరంగా ఉంటున్నా ఫ్యాన్స్‌ మాత్రం వదిలిపెట్టడం లేదు.  
విజయ్ ఫ్యాన్స్‌ 'దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కం' అనే సంస్థ పేరుతో తమిళనాట కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కొంతకాలంగా ఈ సంస్థ రాజకీయాల్లోనూ వేలు పెడుతోంది. పోయినేడాది తమిళనాట జరిగిన గ్రామ పంచాయతి ఎలక్షన్స్‌లో ఈ ఫ్యాన్ క్లబ్‌ మద్దతుతో 129 మంది గెలిచారు. ఇక ఇప్పుడు నగరపంచాయితో ఎలక్షన్స్‌లోనూ కొంతమందికి మద్దతు ఇస్తోంది టివిఎమ్ఐ.
విజయ్‌ డైరెక్ట్‌గా ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఎలక్షన్స్‌లో విజయ్ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. కొంతమందిని గెలిపిస్తున్నారు. దీంతో విజయ్‌ డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోందని, గ్రౌండ్‌ రిపోర్ట్‌ తెలుసుకోవడానికే ఫ్యాన్స్ క్లబ్‌ని రంగంలోకి దింపాడని అంటున్నారు  చెన్నై జనాలు.
తమిళనాట సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తాడని కొన్ని దశాబ్దాలపాటు ప్రచారం జరిగింది. రజనీ కూడా లాస్ట్‌ మినిట్‌ వరకు ట్రై చేసి, ఫైనల్‌గా అనారోగ్య సమస్యలతో పాలిటిక్స్‌కి దూరం అని చెప్పాడు. కమల్‌ హాసన్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేదు. దీంతో విజయ్‌ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి ఫ్యాన్ క్లబ్‌ని దింపాడని చెప్తున్నారు. అభిమానులు లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌లో తీసుకొచ్చే రిజల్ట్‌ని బట్టి విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరి ఈ వ్యవహారానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: