నియోజకవర్గంలో రెండు వేల మందికి దళిత బందు.. కేసీఆర్..!

MOHAN BABU
 తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని పథకాలతో చాలా వేగంగా ముందుకు పోతున్నారు. ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ మిషన్ భగీరథ, పింఛన్, ఇలా అనేక పథకాలతో ఆయన దేశానికి తెలంగాణ తలమానికంగా చేసే విధంగా  ముందుకు పోతున్నారని చెప్పవచ్చు. అయితే  ప్రస్తుతం కెసిఆర్ హుజురాబాద్ ఎన్నికల ముందు దళిత బందు అనే పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ పథకం రాష్ట్రమంతా అమలు చేస్తానని అంటున్నారు. మరి ఈ పథకం గురించి, తెలంగాణలో అభివృద్ధి గురించి ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసుకుందామా..?

ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో కలెక్టరేట్ సముదాయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా ఒకప్పుడు ఎంతో కరువు ప్రాంతం అని మరోసారి గుర్తు చేశారు. తెరాస పార్టీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, వచ్చే సంవత్సరం వరకు అన్ని నియోజకవర్గాలు నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటాయని,అలాగే జనగామ జిల్లా కు మెడికల్ కాలేజీలు కూడా మంజూరు చేస్తామని ఆయన తెలియజేశారు. పాలకుర్తిలో  కూడా డిగ్రీ కాలేజ్  ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం 40వేల కుటుంబాలకు దళిత బందు  అందిస్తున్నామని, మార్చి నెల తర్వాత  ప్రతి ఒక్క నియోజకవర్గంలో  రెండు వేల కుటుంబాలకు దళిత మందు అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

నేను చేసినటువంటి అభివృద్ధి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడనని, అవేంటో మీకు అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో దేశాన్ని పాలించే ప్రభుత్వం తెలంగాణలో సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే సమైక్యాంధ్ర పాలనతో ఎంతో నష్టపోయామని, సొంత రాష్ట్రంలో ప్రజలు డెవలప్ అవుతున్నారని అన్నారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రైతు బంధు ప్రవేశపెట్టామని, ఎలాంటి దరఖాస్తు కూడా లేకుండానే హైదరాబాదులో ప్రభుత్వం విడుదల చేస్తే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: