ఆ ఎమ్మెల్యేలకు మూడో ముచ్చట తీరేనా?

M N Amaleswara rao
ప్రస్తుతం రాజకీయాల్లో ఏ నాయకుడుకైన ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడం అనేది పెద్ద విషయమే...ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అని చెప్పి చాలామంది నేతలు భావిస్తున్నారు...అయితే ఒక్కసారి కాదు..మూడో సారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ నేతలకు తిరుగుండదనే చెప్పొచ్చు. రాజకీయంగా ఆ నేతలు తోపులు అన్నట్లే లెక్క. ఏపీ రాజకీయాల్లో చాలామంది నేతలు మూడో కంటే ఎక్కువసార్లు గెలిచిన వారు ఉన్నారు.
వారి గురించి పక్కన పెట్టేస్తే...మూడో సారి గెలవాలని చెప్పి చాలామంది నేతలు ప్రయత్నిస్తున్నారు. మూడో సారి కూడా గెలిచి రాజకీయంగా సత్తా చాటాలని చెప్పి పలువురు ఎమ్మెల్యేలు చూస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు మూడో విజయం దక్కించుకోవడం కోసం తెగ కష్టపడుతున్నారు. అలా మూడో ముచ్చట తీర్చుకోవాలని చూస్తున్న వారిలో వల్లభనేని వంశీ కూడా ఒకరు...ఈయన గత రెండు ఎన్నికల నుంచి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు..2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే...ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ నుంచి నిలబడి గన్నవరం బరిలో మూడో విజయం అందుకోవాలని వంశీ చూస్తున్నారు. అటు తిరువూరులో మూడో విజయం అందుకోవాలని ఎమ్మెల్యే రక్షణనిధి కూడా ట్రై చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి గెలిచారు...ఇక 2024 ఎన్నికల్లో కూడా తిరువూరులో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని రక్షణనిధి చూస్తున్నారు.
ఇక మూడో విజయం కోసం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా ట్రై చేస్తున్నారు...2009లో ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పెడనలో గెలిచారు. 2014లో వైసీపీ నుంచి మైలవరంలో పోటీ చేసి ఓడిపోయారు...2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పెడనలో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ సారి మూడో విజయం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇటు విజయవాడ సెంట్రల్‌లో మల్లాది విష్ణు సైతం మూడో విజయం కోసం ట్రై చేస్తున్నారు. మరి ఈ ఎమ్మెల్యేల మూడో ముచ్చట తీరుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: