బీజేపీలోకి రామ్ గోపాల్ వర్మ హీరోయిన్..?

Purushottham Vinay
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజుకో కొత్త ఫేస్ లనేవి రాజకీయాల్లోకి వస్తున్నాయి. గతంలో నటుడు సోనూసూద్ తన సోదరి మాళవిక సూద్ ను ఎన్నికల రణరంగంలోకి పోటీకి దింపుతున్నట్లు ప్రకటించడం జరిగింది.ఇక ఇప్పుడు ప్రముఖ నటి మహి గిల్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు.భారతదేశంలో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇక తాజాగా రాజకీయ రంగంలోకి దిగింది హాట్ హీరోయిన్ మహి గిల్.ఇక మహీ గిల్ పంజాబ్లో బీజేపీ పార్టీలో చేరినట్లు సమాచారం తెలిసింది. పంజాబీ నటుడు హాబీ ధలీవాల్తో కలిసి ఆమె చండీగఢ్లో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మహిగిల్ కు పుష్పగుచ్చం కూడా అందించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. సీఎం ఖట్టర్ తోపాటు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బీజేపీ నేత దుష్యంత్ గౌతమ్ కూడా ఇందులో పాల్గొన్నారు.మహి గిల్ చాలా కాలంగా సినిమాలు ఇంకా అలాగే ఓటీటీలో సినిమాలు చేస్తున్నారు.

మంచి హిట్ అయిన 'నాట్ ఎ లవ్ స్టోరీ' సినిమాలో రాంగోపాల్ వర్మ వంటి అగ్ర దర్శకుడితో వారితో పనిచేశారు.మహిగిల్ కు గత రెండు దశాబ్ధాలుగా హిందీ పంజాబీ చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధంఅనేది ఉంది. 46 ఏళ్ల మహి గిల్ 2003లో 'హవా' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దీని తర్వాత ఆమె 'ఖుషీ మిల్ గయా' సిర్ఫ్ పంచ్ దిన్ వంటి పంజాబీ సినిమాలలో కూడా నటించారు. వెండితెరపైనే కాదు ఆమె తాజాగా రాజకీయాల్లో కూడా బాగా రాణించేందుకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.2008లో 'డేవ్ డి' అనే హిందీ రోమాంటిక్ సినిమాలో నటించడం మహి గిల్ కెరీర్ ను బాగా మలుపు తిప్పింది. ఇక ఈ సినిమాని అనురాగ్ కశ్యప్ రచించి దర్శకత్వం వహించారు. ఇక అలాగే సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ ఫ్రాంచైజీ .. జాతీయ అవార్డు అందుకున్న పాన్ సింగ్ తోమర్   సినిమాలో కూడా నటించారు.ఇక ఇవి మాత్రమే కాదు.. ఇంకా క్రైమ్ వెబ్ సిరీస్ 'రక్తాంచల్'తోపాటు దబాంగ్ గులాల్ నాట్ ఏ లవ్ స్టోరీ బుల్లెట్ రాజా వెడ్డింగ్ యూనివర్సిటీ వంటి సినిమాలతో మహి గిల్ బాగా పాపులర్ హీరోయిన్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: