కారుని లేపుతున్న హస్తం..?

M N Amaleswara rao
అదేంటి...కారుని హస్తం లేపడం ఏంటి? అసలు టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు ఉప్పు-నిప్పు మాదిరిగా ఉన్నాయి కదా...అలాంటప్పుడు కారు పార్టీకి హస్తం ఎలా సాయం చేస్తుందని డౌట్ రావొచ్చు. అవును డౌట్ ఏముంది..నిజమే కూడా...టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఓ రేంజ్‌లో యుద్ధం చేస్తుంది. పైగా కారు-కమలం ఒకటే అని మొర పెట్టుకుంటుంది. ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ని తోక్కేయడానికి చూస్తున్నాయని పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పైకి శత్రువులుగా కొట్లాడుతున్నా సరే...లోపల మాత్రం వారు మిత్రులు అని అంటున్నారు.
ఇక రేవంత్ చేసే కామెంట్లు కూడా వాస్తవానికి దూరం ఉన్నట్లు కనిపించవు. అప్పుడప్పుడు టీఆర్ఎస్-బీజేపీల రాజకీయం చూస్తుంటే...కావాలని కాంగ్రెస్‌ని సైడ్ చేయడానికేనా అన్నట్లు ఉంటుంది. సరే చాలావరకు టీఆర్ఎస్‌కు బీజేపీ పరోక్షంగా సాయం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ఎలా సాయం చేస్తుందని అనుకోవచ్చు. దీనికి కూడా క్లారిటీ ఉందని విశ్లేషకులు అంటున్నారు.
టీఆర్ఎస్-బీజేపీలు కలిసి డ్రామా ఆడుతుంటే కాంగ్రెస్ ఆ డ్రామాని ఆపలేకపోతుందా? కమలం వల్ల ఓట్లు చీలిపోతాయని భయపడుతున్నప్పుడు... ఇంకా ప్రజలు మద్ధతు పెంచుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పైన లేదా? అంటే ఉందనే చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఏ  మాత్రం పనిచేయడం లేదు. పక్క పార్టీలపై పోరాటడం చేయడం పక్కనబెడితే...ముందు సొంత పార్టీలోనే నేతలే...ఒకరిపై ఒకరు పోరాటం చేసుకుంటున్నారు.. విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీని మరింత డ్యామేజ్ చేసేలా ముందుకెళుతున్నారు..రేవంత్ ఎంత లైన్‌లో పెట్టాలని చూసినా సరే ప్రయోజనం లేకుండా పోతుంది.
అసలు సొంత గొడవలతోనే ముందుకెళితే..ఇంకా టీఆర్ఎస్‌పై పోరాడేది ఎప్పుడు...ప్రజల మద్ధతు దక్కించుకునేది ఎప్పుడు. ఎంతసేపు ఇదే రచ్చతో ఉంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యం. ఒకవేళ బీజేపీ బాగా ఓట్లు చీల్చి కాంగ్రెస్‌కు డ్యామేజ్ చేసి, టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కృషి చేస్తే...ఆ తప్పు కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. మూడో సారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటే...అది కాంగ్రెస్ పార్టీ వల్లే అని చెప్పొచ్చు. మరి చూడాలి కాంగ్రెస్..టీఆర్ఎస్‌ని అధికారంలో నుంచి దించుతుందో..అధికారంలోకి తీసుకొస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: