శబరిమలలో హై అలర్ట్... కారణం తెలుసా...!

Podili Ravindranath
పవిత్ర పుణ్యక్షేత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేరళలోని పంబా నది తీరంలో ఉన్న శబరిమల పుణ్యక్షేత్రం.. పూర్తిగా పోలీసు చేతుల్లోకి వెళ్లిపోయింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమలలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శబరిమల ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గంలోని పెన్ ఘాట్ వంతెన కింద దాచిపెట్టిన పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. పెన్ ఘాట్ వంతెన కింద మొత్తం 6 జిలెటిన్ స్టిక్స్ గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు మకర జ్యోతి దర్శనం కోసం పెద్ద ఎత్తున శబరిమల చేరుకున్నారు. కరోనా కారణంగా గతేడాది కొండపైకి భక్తులను ట్రావెన్ కోర్ దేవస్థానం అనుమతి ఇవ్వలేదు. కానీ ఈ ఏడాది మాత్రం వ్యాక్సినేషన్ వేయించుకున్న వారికి శబరి గిరిపైకి అనుమతి ఇచ్చింది. దీంతో ఈ ఏడాది దాదాపు 4 లక్షల మంది భక్తులు... మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శబరిమలకు వెళ్లే ప్రధాన మార్గంలోనే భారీగా పేలుడు పదార్థాలు లభించడం పెద్ద కలకలం రేపుతోంది.
పెన్ ఘాట్ వంతెన కింద జిలెటిన్ స్టిక్స్ దొరకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన ఆలయ మార్గాలను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో సోదాలు నిర్వహించారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సిబ్బంది వంతెన పరిసర ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఓ వైపు కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నప్పటికీ... కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూనే అయ్యప్ప భక్తులు మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఆలయ పరిసరాలు మొత్తం శరణుఘోషతో మారిమోగిపోయాయి. శబరిమల వాసికి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు కూడా. భక్తులు రాకపోకలు సాగించే ప్రధాన మార్గంలోనే పేలుడు పదార్ఖథాలు లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలు, పర్యాటక క్షేత్రాలపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంల నిర్వహించిన తనిఖీల్లోనే జిలెటిన్ స్టిక్స్ లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: