యూపీలో బీజేపీ పరిస్థితి ఏమిటో తెలుసా...!

Podili Ravindranath
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నగరా మోగింది. ఇంకా చెప్పాలంటే... మరో 20 రోజుల్లో తొలి దశ పోలింగ్ కూడా జరగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల పదవ తేదీ నుంచి మార్చి నెల 7వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. అలాగే మార్చి నెల పదవ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామన్నారు అధికారులు. దీంతో దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. అయితే అందరి దృష్టి మాత్రం ప్రధానంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంజాబ్ రాష్ట్రంపైనే ఉంది. యూపీలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తుంటే... పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కాషాయ పార్టీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. యూపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రధానంగా అధికార భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందని ఇప్పటికే అన్ని సర్వే నివేదికలు వెల్లడించాయి.
యూపీలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటేకి ఏబీపీ - సీ ఓటర్ సంస్థ సర్వే రిపోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ కూడా ఇదే మాటను మరోసారి వెల్లడిస్తోంది. తాజాగా ఇండియా టీవీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలింది. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో అధికార కమలం పార్టీకి జరగనున్న ఎన్నికల్లో 240 నుంచి 250 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండియా టీవీకి చెందిన గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఒపీనియన్ పోల్ రిపోర్ట్ వెల్లడించింది. అధికారం ఖాయమని ధీమాతో ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి కేవలం 160 నుంచి 165 సీట్లు గెలుస్తుందని తేల్చేసింది. రెండేళ్లుగా యూపీపైనే స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ... కేవలం 5 నుంటి 7 సీట్లలో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఇక మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అయితే కేవలం 2 సీట్లు మాత్రమే గెలవనున్నట్లు నివేదికలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: