రాయలసీమ : పరిటాల ఫైట్ మామూలుగా లేదుగా ?

Vijaya


అనంతపురం జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లోను జనాల దృష్టిని ఆకర్షిస్తున్నవి రెండే నియోజకవర్గాలు. అవేమిటంటే రాప్తాడు, ధర్మవరం. వీటికి ఎందుకింత ప్రాధాన్యత అంటే లోకల్ గా రాజకీయం వల్లే అంత ఇంపార్టెన్స్ వచ్చేసింది. విషయం ఏమిటంటే రెండు నియోజకవర్గాల్లోను రాబోయే ఎన్నికల్లో పరిటాల కుటుంబమే పాగా వేయాలని పావులు కదుపుతోంది. రాప్తాడులో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు.



రాప్తాడులో తల్లి సునీతకు టికెట్ ఇస్తే పోటీచేసింది మాత్రం శ్రీరామ్. రాబోయే ఎన్నికల్లో రాప్తాడులో సునీత, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేయాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరి వీళ్ళకు దక్కేది ఒక టికెట్టా లేకపోతే వీళ్ళ ఒత్తిడికి చంద్రబాబునాయుడు లొంగిపోతారా అనేది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే రాప్తాడు పోటీగురించి నోరువిప్పని సునీత ఈమధ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతు ధర్మవరంలో పోటీ చేయబోయేది శ్రీరామే అంటు చేసిన ప్రకటన సంచలనంగా మారింది.



అంటే సునీత ఆలోచనల ప్రకారం రాప్తాడులో సునీత, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేస్తారు. అయితే రాప్తాడులో ఇబ్బంది లేదుకానీ  ధర్మవరంలో సమస్యంతా వస్తాంది. దర్మవరం మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి బీజేపీ లోనుండి వచ్చేసి టీడీపీలో యాక్టివ్ అయిపోయారు. దాంతో టికెట్ కోసం వరదాపురం-శ్రీరామ్ మధ్య పోటీ పెరిగిపోతోంది. చంద్రబాబుకేమో టికెట్ వరదాపురంకు ఇవ్వాలనుందని పార్టీ వర్గాలంటున్నాయి. కానీ పరిటాల కుటుంబం మాత్రం టికెట్ కోసం చంద్రబాబుపై బాగా ఒత్తిడి పెంచేస్తున్నారు.



ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కూడా తానే గెలవాలని తోపుదుర్తి ప్రకాష్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటు వెళుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ కూడా మంచి సంబంధాలున్నాయి. అదే సమయంలో పరిటాల కుటుంబం అంటే పడనివారంతా తోపుదుర్తికి మద్దతుగా నిలుస్తున్నారు. అంటే జరుగుతున్నది చూస్తుంటే పరిటాల కుటుంబం  రాప్తాడులో గెలుపుకోసం, ధర్మవరంలో టికెట్ కోసం పెద్ద ఫైటే చేస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: