సికింద్రాబాద్ క్లబ్ అగ్ని ప్రమాదంలో వెలుగులోకి కీలక విషయాలు !

Veldandi Saikiran
సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రెసిడెంట్ రఘు రాం రెడ్డి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిన తమ సిబ్బంది గుర్తించినట్లు రఘురాం రెడ్డి తెలిపారు. క్లబ్ లో అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 25 కోట్ల రూపాయల మేరకు నష్టం కలిగినట్లుగా  ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా యాభై వేల చదరపు అడుగుల సంబంధించిన ఆస్తి పూర్తిగా దగ్ధమైంది అంటూ పేర్కొన్నారు .క్లబ్ బాల్ రూమ్ సమీపంలోనే ఉన్న స్టైర్ కేస్ కిందిభాగంలో ముందుగా అగ్నిప్రమాదం సంభవించినట్లు తమ సిబ్బంది గుర్తించినట్లు వెల్లడించారు.   

ఒక్కసారిగా పొగలు వస్తుండటంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చానని వెల్లడించారు . అయితే బాల్ రూమ్ తో పాటుగా పక్కనే ఉన్న అన్ని తో సహా మిగతా అన్ని ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా వుడెన్ తో తయారుచేసిన కావడంతో వెంటనే అగ్నికి ఆహుతయ్యాయని వెల్లడించారు. 1878 సంవత్సరంలో ఈ క్లబ్ స్థాపించడం జరిగింది..  అప్పటి నుంచి ఈ క్లబ్ ఒక హెరిటేజ్ క్లబ్ కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత అతి పురాతన క్లబ్ సికింద్రాబాద్ క్లబ్ ఉందని తెలిపారు .ఈ అగ్ని ప్రమాదం సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారని చెప్పారు.

ఇక  సికింద్రాబాద్ క్లబ్ అగ్ని ప్రమాదం పై వివిధ కోణాల్లో  దర్యాప్తు చేస్తున్నారు నార్త్ జోన్ పోలీసులు.  సికింద్రాబాద్ క్లబ్ అగ్ని ప్రమాదం పై ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది క్లుస్ టీమ్.    ఫైర్ సిబ్బంది నుండి ప్రమాదం పై పలు వివరాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు నార్త్ జోన్ పోలీసులు .  క్లబ్ 50 వేల చదరపు అడుగుల స్థలంలో టేకు ఇంటీరియర్‌తో పాటు విలువైన మద్యం, నగేసిలు, ప్రాచీన అరుదైన ఫర్నీచర్ కాల్‌నైట్‌ బార్‌ బంగ్లా కిచెన్‌, మిలట్రీ అధికారుల కార్యాలయాలు అగ్నికీ ఆహుతి అయినట్లు గుర్తించారు నార్త్ జోన్ పోలీసులు. ఈ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: