తగ్గేదెలే : రేపటి నుంచి యథావిధిగా విద్యాసంస్థలు ప్రారంభం ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు పై క్లారిటీ ఇచ్చారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. పాఠశాలలకు సెలవులు పొడిగించిన ఆలోచన ప్రస్తుతం తమకు లేదని తేల్చి చెప్పేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. సంక్రాంతి సెలవులు పొడిగింపు పై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ లో విస్తృత చర్చ నిర్వహించారు. అయితే తెలంగాణ రాష్ట్రం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పాఠశాలలకు సెలవులు ఉంటాయని అందరూ ముందుగానే భావించారు. అయితే అందరి ఆలోచన కు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు దీని పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఎవరు దీని పై ఆశలు పెట్టుకోకూడదు అని... రేపటి నుంచి ఎలా విధిగా పాఠశాలలు మరియు కళాశాలలు ప్రారంభమవుతాయని కుండబద్దలు కొట్టారు ఆదిమూలపు సురేష్. 

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పాజిటివ్ రేటు ఇప్పటికే 14 శాతానికి చేరుకుంది. కరోనా పాజిటివ్ వీటి రేట్లు విపరీతంగా పెరగడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిడి తమ పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తి కానందున ఒకవేళ పాఠశాలలకు పంపిస్తే కరోనా మహమ్మారి సోకి ప్రమాదం ఉందని విద్యార్థులు అటు విద్యాశాఖ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి గా ముందుకు వెళుతోంది.  కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్థలు నడిపిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యార్థులు విద్య సంవత్సరాన్ని సిలబస్ను చాలా కోల్పోయారని ఇలాంటి సందర్భంలో కచ్చితంగా విద్యాసంస్థలు నడపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యాసంస్థల హాలిడేస్ ను పెంచింది కేసీఆర్ సర్కార్. జనవరి 30 వ తేదీ వరకు విద్యా సంస్థలు మూసివేయాలని కేసీఆర్ సర్కార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: