అక్క‌డ కమ్మ వర్సెస్ రెడ్డి: పైచేయి ఎవరిది...?

VUYYURU SUBHASH
ఏపీ రాజకీయాలని కమ్మ, రెడ్డి వర్గాలే శాసిస్తున్న విషయం తెలిసిందే. ఉండటానికి బీసీ, కాపులు, ఎస్సీల కంటే తక్కువ ఉన్నా సరే రాజకీయంగా ఆ రెండు వర్గాలదే పైచేయి. పైగా రెండు ప్రధాన పార్టీల అధినేతలు ఆ రెండు వర్గాలకు చెందిన వారు కావడంతో, ఏపీ రాజకీయాల్లో వారు హవానే ఎక్కువ. టీడీపీలో కమ్మ, వైసీపీలో రెడ్డి వర్గం హవా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.
అయితే ఈ రెండు వర్గాల అధినేతలు స్టేట్ లెవెల్‌లో తలపడితే...రెండు వర్గాలకు చెందిన కొందరు నేతలు నియోజకవర్గాల స్థాయిలో పోటీ పడుతున్నారు. అలా ఒంగోలులో వైసీపీ నుంచి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ నుంచి దామచర్ల జనార్ధన్‌ల మధ్య ఫైట్ నడుస్తోంది. ఇక గురజాలలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఉండగా, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు.
ఇక మంగళగిరిలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉండగా, టీడీపీ నుంచి నారా లోకేష్ ఉన్నారు. చంద్రగిరిలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ నేత పులివర్తి నాని, అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి, టీడీపీ నేత ప్రభాకర్ చౌదరీ ఉన్నారు. రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నుంచి పరిటాల ఫ్యామిలీ...ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ఇలా పలు నియోజకవర్గాల్లో రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్లు వార్ నడుస్తోంది.
అయితే గత ఎన్నికల్లో కమ్మ నేతలపై పూర్తిగా రెడ్డి నేతలు డామినేట్ చేశారు. కానీ ఈ సారి సీన్ మారుతుంది. దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలని డామినేట్ చేసేలా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకున్నారు. ఇక చంద్రగిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: