ఏపీలో కంప్లీట్ లాక్ డౌన్... షాక్ లో ప్రజలు?

VAMSI
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కరోనా కేసులు, కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కొందరు శాస్త్రవేత్తలు ఈ సారి అంత పెద్ద ప్రమాదం ఉండబోదని అభిప్రాయపడుతుంటే, మరి కొందరు నిపుణులు మాత్రం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను తక్కువ అంచనా వేయడానికి లేదని నిర్లక్ష్యం ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. కాగా ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కరోనా నిబందలను మరింత కట్టు దిట్టం చేసింది. సోషియల్ డిస్టెన్స్, శానిటైజర్ వినియోగం, మాస్క్ లు వాడకం వంటి విషయాలలో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.
ఎవరైనా కరోనా నిబందలను అతిక్రమిస్తే వారిపై వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక తాజాగా ఆంధ్రలో నైట్ కర్ఫ్యూ మొదలైన విషయం తెలిసిందే. కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా నైట్ కర్ఫ్యులను అమలు చేస్తుండగా ఇపుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని జనవరి 10 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ మొదలయ్యింది. రాత్రి కర్ఫ్యూ కారణంగా షిఫ్ట్ ల ప్రకారం డ్యూటీలు చేస్తూ  పకడ్బందీగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయితే ఇపుడు ఇందుకు సంబంధించి మరో వార్త హాట్ టాపిక్ గా మారింది.
కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ఇపుడు ఏపి ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అది పెద్ద పండుగ సంక్రాంతికి ముందా లేక తర్వాత అన్న అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా విజృంభణను కట్టడి చేసేందుకు ఏపి ప్రభుత్వం ఈ తరహా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్యాబినెట్ భేటీ జరపనున్నారు అట. ఈ భేటీలో ఈ కీలక విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మరి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఉంటుందా లేదా ఇంకొన్నిరోజులు ఆగితే తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: