ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఆ 3 రోజులు లాక్ డౌన్?

VAMSI
కరోనా పోయింది కదా అనుకుంటే అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ మనపై పగబట్టినట్టు అయింది. అందుకే రూపాన్ని మార్చుకుని మరి ఒమిక్రాన్ అంటూ కొత్త వేరియంట్ గా మనపైకి మళ్ళీ పంజా విసురుతోంది. రెండేళ్ల పాటు కరోనాతో మానవాళి మొత్తం నరకాన్ని చవిచూసింది. ఊహ తెలియని పసివారు సైతం ఈ కరోనా దాటికి బాధపడ్డారు. అయితే కాస్త కొద్ది రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన కరోనా ఇపుడు మళ్ళీ మరో రూపం దాల్చి ఒమిక్రాన్ వేరియంట్ గా మన ముందుకు వచ్చింది. అక్కడెక్కడో ఆఫ్రికా లో తన ప్రస్థానం మొదలు పెట్టి ఇపుడు దేశ సరి హద్దులు దాటి పలు దేశాలతో పాటు మన భారత్ లోకి సైతం ప్రవేశించింది.
పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కలకలం మొదలయ్యింది. ఇటు ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. అయితే కరోనా విషయంలో లాగా కాకుండా ఇపుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అటు ప్రభుత్వం ఇటు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆ ముందు జాగ్రత్త పెద్దగా కనిపించకపోవడంతో ముందస్తు ప్రణాళికగా జగన్ సర్కారు లాక్ డౌన్ ను అమలు చేసేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ప్రస్తుతానికి లాక్ డౌన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంకో పది రోజుల్లో న్యూ ఇయర్ రానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ ౩౧ రాత్రి ఏ విధంగా సంబరాలు జరుపుకుంటారో మనకు తెలిసిందే. అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడుతారు కాబట్టి డిసెంబర్ 30 నుండి జనవరి 1 వరకు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించనున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా ఒక స్పష్టత రాలేదు. మరి ఈ వార్త నిజంగా కొందరికి నిరాశను మిగుల్చుతుందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: