వామ్మో.. నల్ల ఇడ్లీలు ఏంట్రా స్వామి?

praveen
భారతీయులు అందరు కూడా అల్పాహారంలో ఇడ్లీ దోశ వడా లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇక ఎక్కువగా భారతీయులు మెచ్చేది మాత్రం ఇడ్లీ అని చెప్పాలి.. ఎందుకంటే ఆయిల్ తో సంబంధం లేకుండా ఇడ్లీ వంటకం తయారవుతూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇడ్లీలు తినడానికి ఆసక్తి చూపుతుంటారు. సాధారణంగా ఇడ్లీలు అంటే ఎలా ఉంటాయో దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. తెల్లగా మల్లెపూలాగ ఉంటాయి. ఇక ఇడ్లీలు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతూవుంటాయి. అందుకేనేమో ఎక్కువగా ఇడ్లీలను ఇష్టపడుతూ ఉంటారు అందరు.

 అయితే తెల్లగా తళతళలాడే పోయే ఇడ్లీలు ఏకంగా నల్ల రంగులోకి మారితే ఎవరైనా తింటారా.. ఛీ ఇడ్లీలు ఏంటి  ఇలా ఉన్నాయి ఏంటి.. ఇలా ఉంటే ఎవరైనా తింటారా అని చిరాకు పడతారు ఎవరైనా. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు మాత్రం నల్ల ఇడ్లీలే ప్రస్తుతం ట్రెండ్ అంటూ చెప్పేస్తున్నారు. భారతీయులకు కొత్తగా నల్ల ఇడ్లీలను పరిచయం చేస్తున్నారు. ఇక ఈ నల్ల ఇడ్లీలను చూసి ప్రస్తుతం అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

 నల్ల ఇడ్లీలు ఏంటి గురు అది ఎలా సాధ్యం అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారు కదా. మహారాష్ట్ర లోని ఓ రెస్టారెంట్ లో ఇలా నల్ల ఇడ్లీ లను తయారు చేశారు. వివేక్ అనే వ్యక్తి నల్ల ఇడ్లీలను తయారుచేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ నల్ల ఇళ్లపై మరిన్ని ప్రయోగాలు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. నల్ల ఇడ్లీల పిండి తో ఇడ్లీ లు చేసి వాటిపై నెయ్యిని ధారగా పోస్తారు. ఆ తర్వాత కారం చల్లుతారు. ఆ తర్వాత నీళ్ల లాంటి కొబ్బరి చెట్నీ పోస్తారు.ఇక అలాగే నల్ల ఇడ్లీలను తినాలి. అయితే ఈ నెల ఇడ్లీలు  ధర కూడా ఎక్కువే నండోయ్.. ఏకంగా ఒక ప్లేట్ 90 రూపాయల వరకు అమ్ముతున్నారట. అసలే నల్ల ఇడ్లీలు ఆపై ధర కూడా ఎక్కువ ఎవరు తింటారులే అని అనుకుంటున్నారు కదా.. అలా అనుకుంటే పొరపాటే.. నల్ల ఇడ్లీలు పొట్టలో ఉన్న చెడు వ్యర్థాన్ని తొలగిస్తాయి అని చెప్పడంతో ఎంతోమంది ధర ఎక్కువైనా ఇడ్లీలను తినడానికి  ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: