క్యాంప్ పాలిటిక్స్ తెరాసకు కలిసొచ్చేనా..!

MOHAN BABU
కరీంనగర్లో జరిగినటువంటి కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న టువంటి స్థానిక ప్రజలు ,ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, బుద్ధిజీవులు, మేధావులు, క్యాంపు రాజకీయాలను ఘాటుగా విమర్శిస్తున్నారు. క్యాంపు రాజకీయాలకు పాల్పడిన స్థానిక మంత్రి ప్రభుత్వం ముఖ్య మంత్రి అధికారులను "ఇదంతా ప్రభుత్వం తమ సామాజిక ధర్మాన్ని విస్మరించడమే" నని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంపైన.
 ఒకవైపు అనేక రకాల పథకాలను ప్రవేశ పెట్టినట్లు ప్రచారం చేసుకుంటూ నే దళిత బంధు పథకం కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసం ప్రవేశ పెట్టి ఎన్నికలుకాగానే దాని ఊసే ఎత్తకపోవడం ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి..? అని ప్రశ్నిస్తున్నారు.
      మరొకవైపు రైతుబంధు పథకాన్ని 5, 10 ఎకరాలు ఉన్నటువంటి సామాన్య, సన్నకారు, చిన్నకారు రైతుల తోపాటు కౌలు రైతులకు వర్తింప చేయవలసినది పోయి బడా భూస్వాములకు వందలాది ఎకరాలు ఉన్నటువంటి వారికి వర్తింపచేయడం కోట్లాది రూపాయలు అప్పు చేసి కొప్పు లు పెట్టడం. పేద ప్రజానీకం మీద ప్రేమతో కాదు ఉన్నత వర్గాల కొమ్ము కాయడానికి ఉద్దేశించినదే ఈ పథకం అని ప్రజలు రైతులతో పాటు అనేక మంది ప్రజాస్వామిక వాదులు కూడా   ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వము ద్వారా టిఆర్ఎస్ టిక్కెట్పై ఎన్నికైన టువంటి స్థానిక ప్రజా ప్రతినిధులను ఎందుకోసం క్యాంపు రాజకీయాలకు తీసుకువెళ్లారు..? జవాబు చెప్పాలని ఈ సందర్భంగా అనేక మంది  అడుగుతున్నారు. ఎన్నికలు అంటే స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలి. కానీ క్యాంపుల్లో బలవంతంగా నిర్బంధించి తప్పకుండా తెరాస పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఆదేశించడం ప్రజాస్వామ్యానికి తగని పని. అవసరమైతే ప్రతిపక్షాలు ఇలాంటి క్యాంపులు నిర్వహించుకుంటే కొంత అర్థం ఉంటుంది. కానీ అధికారం ఉంది తన పార్టీకి చెందిన టువంటి వాళ్లపైగా కూడా నమ్మకం లేక క్యాంపులు వేయడం ప్రభుత్వానికి దినదినం తన పార్టీ అనుచరుల మీద తగ్గుతున్న అవిశ్వాసానికి ప్రాతిపదికగా తీసుకోవచ్చు.


      పార్టీ , ప్రభుత్వ నిధులను ఇలాంటి క్యాంపు రాజకీయాల ఓటర్లను ప్రలోభపెట్టడానికి వ్యక్తిగతంగా కోట్ల రూపాయలను గుమ్మరించ డానికి ప్రతిసారి ప్రభుత్వం తెరాస పార్టీ ఎన్నికల సందర్భంలో ఖర్చు చేయడం పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఎన్నికల గురించి ఆలోచించడం, ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగానికి పాల్పడటం, సంబంధిత మంత్రులు శాసన సభ్యులు స్థానిక ప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం, తమ బాధ్యతను విస్మరించదాన్ని కూడా ఇటీవలి కాలంలో ప్రజలు బాగా గమనిస్తున్నారు అని ఈ క్యాంపు రాజకీయాల వల్ల తెలుస్తున్నది. ఈ స్థానము నుండి గతంలో తెరాస పార్టీ మేయర్ గా పని చేసినటువంటి రవీందర్ సింగ్ ఉద్యమ కారులను ఉద్యమ భావజాలాన్ని నమ్ముకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తన గెలుపు ఖాయమని ప్రకటిస్తున్నట్టు కూడా మీడియా ద్వారా తెలుస్తున్నది. అందుకే కాబోలు వారి నోరుమూయించి అనుకూల అభిప్రాయానికి అడ్డుకట్ట వేయడానికి ,స్వతంత్ర అభ్యర్తి గెలవకుండా చేయడానికి, ప్రభుత్వ పట్టుదలను సాధించడానికి ఇంత నిర్బంధం అవసరమా..?

అని కరీంనగర్లో సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేయడంతోపాటు ముక్కున వేలేసుకుంటున్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించి వేసే అప్రజాస్వామ్యానికి చెక్ పెట్టడానికి ప్రభుత్వమే పూనుకునే బదులు ప్రభుత్వమే అలాంటి  విధానాలకు పాల్పడుతూ ఉంటే చెక్ పెట్టే వారు ఎవరు..? అందుకే ఎన్నికల సంఘం ,న్యాయవ్యవస్థ ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా సుమోటోగా స్వీకరించి ఓటర్ల స్వాతంత్ర్యాలను కాపాడాల్సినభాద్యత ఈ స్వతంత్ర భారతదేశంలో   ఆ సంస్థల పైన ఉన్నది. అయినా ఇలాంటి అరాచకాలు, తప్పుడు విధానాలకు కేవలం చట్టాల తోని మాత్రమే చెక్ పెట్టడం సాధ్యం కాదు. ప్రజా ఉద్యమాలు ,ప్రజాస్వామిక సంస్థలు, అఖిల పక్షాలు కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తే తప్ప ఈ సుదీర్ఘ లక్ష్యాన్ని చేరుకోలేము. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకో లేము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: