వంగ‌వీటి రంగా మర్డ‌ర్‌పై కొత్త దుమారం రేపిన మంత్రి బొత్స‌...!

VUYYURU SUBHASH
వంగవీటి రంగా విజయవాడకు చెందిన ప్రముఖ కాపు నేత. రంగా చనిపోయి 35 సంవ‌త్స రాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన పేరులో ఒక పవర్ ఉంది. రంగా పేరు వింటే ఏపీలో కాపులు అందరూ కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అవుతారు. రంగా హత్య జరిగిన రెండు నెలల వరకు విజయవాడ రావణకాష్టంలా రగిలింది. అసలు ఆయన హత్య వెనుక ఏం జరిగింది ? కార‌ణం ఏంటి ? అన్నది ఈ తరంలో చాలా మందికి తెలియదు. కార్పొరేటర్‌గా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రంగా పేదల కోసం పాటుపడిన మనసున్న నాయకుడు గా మంచి గుర్తింపు పొందారు. విజయవాడ రాజకీయాల్లో రంగా మాస్ లీడర్ గా ఆయన పెరిగారు.
1988 డిసెంబర్ 25 వ తేదీన వంగవీటి రంగా ప్రజా సమస్యలపై నిరాహారదీక్ష చేస్తుండగా ఆయన్ను అయ్యప్ప భక్తుల రూపంలో వచ్చిన కొందరు దుండగులు దారుణంగా దీక్షా శిబిరంలోనే చంపేశారు. అసలు ఎవరు ఈ హత్య చేశారు అన్నదానిపై రకరకాల చర్చలు ఉన్నాయి. అయితే దీని వెనక రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య సంఘర్షణ కారణమని చాలామంది చెబుతూ ఉంటారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్ని సంవత్సరాల తర్వాత రంగా హ‌త్య‌పై కీలకమైన కామెంట్లు చేశారు.
నాడు రంగా హ‌త్య త‌ర్వాత చాలా మంది అది ఖ‌చ్చితంగా అప్పుడు ఉన్న ప్ర‌భుత్వ వైఫ‌ల్య మే అని చెపుతూ ఉంటార‌ని.. ఒక ఎమ్మెల్యే కే ర‌క్ష‌ణ ఇవ్వ‌లేని ప్ర‌భుత్వం నాడు ఉందని చాలా మంది చెప్పార‌ని.. ఏదేమైనా టీడీపీ నిర్వాకం వ‌ల్లే రంగా చ‌నిపోయార‌ని బొత్స చెప్పారు. ఈ మాట తాను అన‌డం లేదని.. రంగా కుటుంబ స‌భ్యులే చాలా సార్లు బ‌హిరంగ వేదిక‌ల మీద చెప్పార‌ని బొత్స గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: