పోలవరం ఖర్చుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు. గోదావరి నదిపై కడుతున్న ఈ మెగా ప్రాజెక్టును ఇప్పటికే కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. దీనికి అయ్యే ఖర్చు మొత్తం కూడా పూర్తిగా కేంద్రం భరిస్తుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇప్పుడు నిధుల విడుదల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. ప్రాజెక్టు వ్యయం పెరిగిందని... దానినే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తోంది. కానీ కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఇప్పుడు తాజాగా రాజ్యసభలో ఈ విషయంపై మరోసారి కేంద్ర జలశక్తి శాఖ క్లారిటీ ఇచ్చేసింది. పోలవరం ప్రాజెక్టులో కేవలం ఇరిగేషన్ విభాగానికి మాత్రమే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని పార్లమెంట్‌లో కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా వ్యయంలో కేవలం ఇరిగేషన్ పనుల ఖర్చు మాత్రమే తాము భరిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ తుది సిఫారసుల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి.
రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయాన్ని రాజ్యసభలో vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. అందుకని దీనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందన్నారు వైసీపీ ఎంపీ. అలాగే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం ఎంత మొత్తంలో నిధులు ఖర్చు చేశారో వివరించాలని కూడా కోరారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన బకాయిలను కూడా కేంద్రం తక్షణమే విడుదల చేయాలన్నారు విజయ సాయి రెడ్డి. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి 2017-18 మధ్యకాలంలో రెండవ సారి సవరించిన అంచనా వ్యయం మొత్తం 55 వేల 548 కోట్ల రూపాయలని గుర్తు చేశారు. దీనిని ఇప్పటికే కేంద్రానికి ఏపి ప్రభుత్వం అందజేసినట్లు కూడా వెల్లడించారు. ఈ ప్రశ్నలకు కేంద్ర మంత్రి బిశ్వేశర్ తుడు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా వ్యయంలో ఇరిగేషన్ విభాగానికి కేవలం 35 వేల 950 కోట్ల రూపాయలుగా కుదించినట్లు మంత్రి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: