దేశ రాజధానిలో వాయు కాలుష్యం అదుపునకు చర్యలు...విద్యుత్ కర్మాగాలు మూసివేసి ప్రభుత్వం

ప్రజల్లో  రోజు రోజుకీ పెరుగుతున్న భయాందోళనలు,  కోర్టుల నుంచి వెంట వెంటనే పడుతున్న అక్షింతల నేపథ్యంలో ప్రభుత్వం  ఒక నిర్ణయాత్మక మైన ముందడుగు వేసింది.  దేశ రాజధాని న్యూ ఢిల్లీ  పై వాయుకాలుష్యాన్ని వెదజల్లుతున్న విద్యుత్ కర్మాగారాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్మయం పై మిత్రమ స్పందన వ్యక్తమవుతోంది.
భారత దేశ రాజధాని ఢిల్లీ నగరం ప్రతి సంవత్సరం వాయుకాలుష్యం బారిన పడుతోంది. కొద్ది రోజులు కాలుష్యం తగ్గినట్టే కనిపించినా, అది మరలా యధాతథ స్థితికి చేరుకుంటోంది.  చలికాలంలా  నగరం అంతా నగరం అంతా కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోవడం సర్వసాధారణమైన విషయంగా మారింది. ఈ ఇబ్బందుల నుంచి బైటపడడానికి అధికారులు, ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు  కొని ఫలితాలు ఇచ్చినా, పూర్తి స్థాయిలో  ఆ చర్యలు ఫలవంతం కాలేదు. నగర పరిసరాలలో వ్యర్థ పదార్ధాలను అగ్నికి ఆహుతి చేస్తుండటం కూడా నగరంలో కాలుష్యం పెరగడానికి ఒక కారణంగా అధికారులు  ఒక నిర్ణయానికి వచ్చారు.  నగర పరిసరాలలో  కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో పరిపాలన సాగిస్తున్న ఆప్ ప్రభుత్వం, అక్కడి ముఖ్యమంత్రి  వివిధ వర్గాలతో చర్చలు జరిపినా ఫలితం అంతంత మాతమే. నగరంలో తిరిగే వాహనాలు, సరి, బేసి సంఖ్యల ఆధారంగా రోజు మార్చి రోజు నడపాలని కూడా  అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో నిర్ణయించారు.  ఆ నిర్ణయం కొంత మేర సత్ఫలితాలను ఇచ్చింది. కరోనా కారణంగా  విధించినన లాక్ డౌన్ తో నగరంలోని  పర్యావరణ ప్రమాద స్థితి  కొంత వరకూ అదుపులోనికి వచ్చింది.
ప్రస్తుతం దేశ రాజధాని నగరంలో  పర్యావరణ పరిస్థితులు రోజు రోజుకూ దిగజారాయి. వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో  అక్కడి పాఠశాలలను  నవంబర్ నేల ఇరవయ్యో తేదీ వరకూ మూసివేశారు. విద్యార్థుల చదువుకు భంగం కలుగకుండా ఆన్ లైన్ పాఠాలను బోధిస్తున్నారు. చాలా కంపెనీలు తమ సిబ్బనంది ఇంటి నుంచి పనిచేయమని కోరాయి.  ఈ  చర్యలు శాశ్వత పరిష్కారం  కాకపోవడంతో న్యాయ స్థానం   ప్రభుత్వాలను గట్టిగా మందలించింది. దీంతో  కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల అధికారులతో చర్చలు జరిపింది. డిల్లీ పరిసరాల్లోని 6 విద్యుత్ కర్మాగారాలను మూసివేయాలని   ఆదేశాలు జారీ చేసింది. అంతే కాక  అత్యవసరమైన వాహనాలు, ఎంపిక చేసిన వాహనాలు తప్ప మరే ఇతర వాహనాలకూ ముఖ్యంగా సరుకులు రవాణా చేసే ట్రక్కులకు నగరంలో రాకపోకలను విషేధించింది. ఈ నిర్ణయం పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పర్యావరణ వేత్తలు కూడా ఈ నిర్మయాన్ని స్వాగతించ లేదు. తాత్కాలిక చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: