కృష్ణాలో ఆ వైసీపీ ఎమ్మెల్యేకు జ‌న‌సేన చెక్ ?

VUYYURU SUBHASH
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన మరొకసారి కీలకం కానుందని చెప్పొచ్చు. జనసేనకు గెలిచే అవకాశాలు లేవు గానీ, గెలుపోటములని ప్రభావితం చేసే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంది. అది కూడా టీడీపీపైనే జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చేసి...టీడీపీకి ఎలాంటి నష్టం జరిగిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

ఓట్లు చీలడం వల్ల చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములు తారుమారయ్యాయి...టీడీపీ గెలవాల్సిన చోట వైసీపీ గెలిచేసింది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన అలాగే విడిగా పోటీ చేస్తే మళ్ళీ టీడీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన చాలా కీలకంగా ఉంది. అలాంటి నియోజకవర్గాల్లో పెడన కూడా ఒకటి. అసలు పెడనలో రెండుసార్లు జోగి రమేష్ గెలవడానికి కారణం చిరంజీవి, పవన్ కల్యాణ్‌లే.

2009 ఎన్నికల్లో తొలిసారి జోగి...కాంగ్రెస్ తరుపున పెడన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు  చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం వల్ల ఓట్లు చీలి...టీడీపీకి ఓడిపోగా, జోగి గెలిచారు. కేవలం వెయ్యి ఓట్లతో జోగి గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి 29 వేల ఓట్లు పడ్డాయి. ఇక 2019 ఎన్నికల్లో పవన్ వల్ల జోగి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి జోగి...టీడీపీపై 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచ్చారు. కానీ ఇక్కడ జనసేనకు పడిన ఓట్లు 25 వేలు.

దీని బట్టి చూసుకుంటే చిరంజీవి, పవన్ వల్ల జోగి ఎలా ఎమ్మెల్యేగా గెలిచారో అర్ధమవుతుంది. ఈ సారి కూడా జనసేన విడిగా పోటీ చేస్తే అదే ఫలితం రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ గెలుపోటములు జనసేన డిసైడ్ చేస్తుంది. ఒకవేళ జనసేన టీడీపీతో కలిస్తే మాత్రం ఖచ్చితంగా జోగి రమేష్‌కు చెక్ పడిపోవడం ఖాయం. మ‌రి పెడ‌న లో వ‌చ్చే ఎన్నిక ల్లో ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో  కాస్త ఆస‌క్తి అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: