బెజ‌వాడ టీడీపీలో మ‌రో సీటు పంచాయితీ...!

VUYYURU SUBHASH
బెజ‌వాడ టీడీపీ కొద్ది రోజులుగా రావ‌ణ కాష్టంలా ర‌గులుతూనే ఉంది. ఇక్క‌డ పార్టీ నేత‌ల ఆధిప‌త్య పోరులో పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంది. అయినా పార్టీ నేత‌లు మాత్రం ఎవ్వ‌రిని లెక్క చేయ‌కుండా త‌మ‌లో తాము క‌ల‌హించు కుంటూనే పోతున్నారు. ఇటీవ‌ల ఈ క‌ల‌హాల నేప‌థ్యంలోనే సులువుగా గెల‌వాల్సిన బెజ‌వాడ కార్పోరేష‌న్ లో టీడీపీ చిత్తు గా ఓడిపోయింది. ఎంపీ కేశినేని నాని వ‌ర్సెస్ న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల మ‌ధ్య ఇప్ప‌ట‌కీ స‌ఖ్య‌త లేదు.

ఇక ముఖ్యంగా ఎంపీకి న‌గ‌ర నేత‌ల‌కు మ‌ధ్య గొడ‌వ‌కు ప‌శ్చిమ నియోజ‌క వ‌ర్గ‌మే కార‌ణంగా కనిపిస్తోంది.  పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలకు చెక్ పెట్టేందుకు ఎంపీ కేశినేని నాని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వ‌స్తున్నారు. అస‌లు ఈ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచే ఆ పార్టీకి అనుకూలంగా లేదు. అక్క‌డ ఆ పార్టీ 1983లో మాత్ర‌మే గెలిచింది. అప్పుడు ఆ పార్టీ నుంచి జయరాజ్ విజయం సాధించారు.

ఆ త‌ర్వాత ఇప్పుట‌కీ కూడా అక్క‌డ టీడీపీ జెండా ఎగ‌ర్లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ సీటును బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఆశిస్తున్నారు. అయితే ఎంపీ నానీ మాత్రం వీళ్లిద్ద‌రులో ఎవ్వ‌రికి సీటు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ ఫ్యామిలీ యాక్టివ్ గా ఉంటే వాళ్ల‌కే సీటు రావ‌చ్చు.. లేని పక్షంలో త‌న అనుచ‌రుల్లో ఎవ‌రికో ఒక‌రికి ఈ సీటు ఇప్పించు కోవాల‌ని నాని ట్రై చేస్తున్నారు. దీంతో బెజ‌వాడ టీడీపీ పంచాయితీ ఇప్ప‌ట్లో తెగేలా లేదు.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన - టీడీపీ నేత‌ల మ‌ధ్య పొత్తు కుదురు తుంది అన్న చ‌ర్చ‌లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.  ఒక వేళ ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరిన పక్షంలో అప్పుడు ఈ సీటు జ‌న‌సేన కు కేటాయిస్తార‌ని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: