యోగికి షాక్.. ఊహించని ఝలక్?

praveen
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రజల మన్ననలు పొందిన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ పాలనకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారు అన్నది మాత్రం మరికొన్ని రోజులలో జరగబోయే ఎన్నికల్లో తేలిపోతుంది. మరికొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే ఈ సారి ఉత్తరప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.

ఇలాంటి సమయంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి ఇటీవలే ఊహించని ఝలక్ తగిలింది. సాధారణ రాజకీయాలు అన్న తర్వాత ఒక పార్టీ నుంచి నేతలు మరొక పార్టీ లోకి వెళ్లడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎన్నికల ముందు వరకు ఒక పార్టీలో ఉన్న నేతలు ఎన్నికల తర్వాత మాత్రం ఇతర పార్టీలలోకి జంప్ అవుతా ఉంటారు. అయితే సాధారణంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారు అధికారపక్షం లోకి వెళ్లడం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ అధికార పార్టీలో  కొనసాగుతున్న వారు ఎవరైనా ప్రతిపక్షం లోకి వెళ్లాలని భావిస్తారా.


 కానీ ఇక్కడ ఇదే జరిగింది.. అధికార పక్షం లో ఎమ్మెల్యే గా కొనసాగుతున్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీ లోకి వెళ్లారు. దీంతో ప్రస్తుతం బిజెపి పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్ కు ఊహించని షాక్ తగిలింది. ఇక ఇలా బిజెపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీలో చేరడం మాత్రం సంచలనంగా మారిపోయిందని చెప్పాలి. బిజెపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాథోడ్ అనే వ్యక్తి ఏకంగా సమాజ్వాది పార్టీ లోకి వెళ్లారు. ఇది సంచలనంగా  మారిపోయింది. అయితే యోగి ఆదిత్యనాథ్ పై అసంతృప్తి కారణంగా తమ పార్టీ వైపు వచ్చినట్లు ప్రజల్లోకి  అఖిలేష్ ఒక భావన తీసుకెళ్లారని ఇది ఎలాంటి పరిణామాలకు  దారితీస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: