టీడీపీ ఆ వైసీపీ నేత‌ల‌నే ఎందుకు టార్గెట్ చేస్తోంది.. పెద్ద క‌థే ఉందా ?

VUYYURU SUBHASH
ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. అయితే కేవ‌లం ఆ రెండు జిల్లాల్లోనే తెలుగుదేశం పార్టీ నేతలు యాక్టివ్ గా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ రెండు జిల్లాల్లోనే వైసీపీ నేత‌ల‌ను టీడీపీ నేతలు టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. టీడీపీ లో ఈ విచిత్ర మైన ప‌రిస్థితి ఏంట‌న్న‌ది చూస్తే ఆస‌క్తిక‌ర ప‌రిణామాలే ఉన్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏపీ లో 13 జిల్లా లు ఉన్నా కూడా ఆ రెండు జిల్లా ల్లో ఉన్న టీడీపీ నేత‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తాము గెలుస్తామ‌న్న ధీమా వ‌చ్చే య‌డ‌మే అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి రావ‌డంతో అమ‌రావ తి జిల్లాలు అయిన కృష్ణా - గుంటూరు జిల్లాలు అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాయి.. ఇంకా చెప్పాలంటే ప‌డుతూనే ఉన్నాయి. ఫ‌లితంగా ఈ రెండు జిల్లా ల‌లో అధికార వైసీపీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు , నేత‌లు కూడా తీవ్ర ఇబ్బందుల తో ఉన్నారు. ఎందుకంటే ప్ర‌జ‌ల ఆదాయం త‌గ్గిపోయింది.. రేపు వీరు వెళ్లి ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితి ఉంది.
గుంటూరు - కృష్ణా  జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు పార్టీలో యాక్టివ్ ఉంటూ వైసీపీ వాళ్ల‌ను చీల్చి చెండాడు తున్నారు. బొండా ఉమ - పట్టాభి - దేవినేని ఉమ - కొల్లు రవీంద్ర - బుద్దా వెంకన్న - నక్కా ఆనంద్ బాబు - ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ - యరపతినేని శ్రీనివాస్ - జీవీ ఆంజ‌నేయులు వంటి నేతలే వైసీపీని టార్గెట్ గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
వీరు ఆ ప్రాంతంలో ఉన్న వైసీపీ నేతలు కొడాలి నాని - సామినేని ఉదయభాను - మల్లాది విష్ణు - జోగి రమేష్ - పేర్ని నానిపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ రాజ‌ధాని ఎఫెక్ట్ త‌మ రెండు జిల్లాల‌పై గ‌ట్టిగా ఉంటుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌లలో త‌మ గెలుపు ఖాయ‌మ‌న్న ధీమా వారిలో వ‌చ్చేసింద‌ని. అందుకే వారు అధికార ప‌క్షంపై విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌జ‌ల్లో ఉంటున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: