హైదరాబాద్ లో టూ లెట్ బోర్డ్ కు ఫైన్ వేస్తున్నారా...?

Sahithya
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ హోర్డింగ్ ల విషయంలో అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. హైదరాబాద్ లో టూ లెట్ బోర్డులకు జరిమానాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ పెట్టడం పట్ల జిహెచ్ఎంసీ అధికారులు సీరియస్ గా ఉన్నారు. ఇక వరుసగా జరిమానాలు విధిస్తున్నారు అనే ఆరోపణలపై అధికారులు స్పందించారు. ఈవీడీఎం కింద సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కట్ ఔట్లు, వాల్ రైటింగ్లకు జరిమానా విధిస్తున్నామని చెప్పారు.
సొంత ఇంటికి టూ లెట్ బోర్డు పెట్టినా ఫైన్ అని వచ్చిన వార్తలను జిహెచ్ఎంసీ ఖండించింది. కేవలం కమర్షియల్ బిజినెస్ ఏజెంట్స్, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్స్ వాళ్లు పబ్లిక్ ప్రదేశాల్లో అంటిస్తున్న పోస్టర్లకు మాత్రమే జరిమానా విధిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగతంగా ఎవరి ఇంటికి వారు పెట్టుకునే టూ లెట్ బోర్డులకు ఫైన్ లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. పబ్లిక్ ప్రదేశాల్లో టూ లెట్, కోచింగ్, రియల్ ఎస్టేట్, పాన్ కార్డు చేస్తాం అంటూ వెలిసిన కొన్ని ప్రచార పోస్టర్లకు జరిమానా విధించారు.
వ్యక్తిగత ఇంటికి పెట్టిన టూ లెట్ బోర్డుకు ఫైన్ విధిస్తే తమ దృష్టికి తేవాలని వాటిని సరిదిద్దుతామని జిహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేసారు.  జిహెచ్ఎంసీ ఈవీడిఎం డైరెక్టర్ విశ్వజిత్ మాట్లాడుతూ... నగరంలో అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కట్ ఔట్లు, వాల్ రైటింగ్లకు జరిమానా విధిస్తున్నం అన్నారు. కాగా హైదరాబాద్ లో ఇటీవల ప్రముఖ సంస్థలకు కూడా ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. కొందరు ఇష్టా రీతిన హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం ఇబ్బంది కలిగించింది. దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తూ వస్తున్నారు. సొంత ఇళ్ళకు టూ లేట్ బోర్డ్ పెట్టడం నేరం కాదని అధికారులు స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: