మరో డేంజర్ వైరస్..ఆఫ్రికాలో తొలి కేసు..!
జులై 25 న సియెర్రా లియోన్, లైబీరియన్ సరిహద్దులకు సమీపంలోని ఎన్జెరెకోర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఎంవీడీ లక్షణాలు కనిపించాయి. ఆగస్టు 1 న జ్వరం, తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి లక్షణాలతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆ వ్యక్తి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో అతనికి పరీక్షలు నిర్వహించగా మార్బర్గ్ వైరస్గా నిర్దారణ అయింది. దీంతో రీహైడ్రేషన్, పేరెంటరల్ యాంటీబయాటిక్స్ సాయంతో బాధితుడికి చికిత్స అందించినట్లు వైద్యాధికారులు చెప్పారు.
అయితే మరుసటి రోజే అతను మరణించినట్లు తెలిపారు. ఈ విషయమై లోతుగా పరిశోధన చేయడానికి జాతీయ వైద్యాధికారులతో పాటు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం గినియాకు వెళ్లింది. ఆ మృతదేహం నుంచి లాలాజల నమూనాలు సేకరించి మార్బర్గ్తో పాటు ఎబోలా పరీక్షలు నిర్వహించారు. ఇందులో మార్బర్గ్ పాజిటివ్ వచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. గినియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డబ్ల్యూహెచ్ఓ, అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు మొదలు పెట్టాయి.
మార్‌బర్గ్ వైరస్‌తో చనిపోయిన వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేసి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఎంవీడీ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది . ఈ వైరస్ కారణంగా తీవ్ర స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. గతంలో జర్మనీ సహా పలు ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ బయటపడినట్లు తెలిపింది డబ్ల్యూమెచ్ఓ.